పక్కవారిపై నిందలేసే స్వభావాన్ని మానుకోనంత వరకూ పాకిస్థాన్ క్రికెట్లో ఎలాంటి అభివృద్ధి ఉండదని ఆ దేశ జట్టు మాజీ సారథి మిస్బా ఉల్ హక్ వ్యాఖ్యానించాడు. గత నెల హెడ్ కోచ్ పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన అతడు మొదటిసారిగా మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాకిస్థాన్ టీ20 స్క్వాడ్ సెలెక్షన్‌పై విమర్శలు గుప్పించాడు.
"మా దగ్గర ఉన్న అసలు సమస్య ఏంటంటే.. మేం ఫలితాన్ని మాత్రమే చూస్తాం. ఓపికతో, ప్రణాళికలు రచించి సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు సమయం ఇవ్వం. దేశవాళీ ఆటగాళ్లను తీర్చిదిద్దాలనే విషయంపై ఎలాంటి శ్రద్ధ వహించం. ఫలితం ఆశిస్తాం. అనుకున్న ఫలితం రాకపోతే పక్క వారిపై నిందలు మోపే వారికోసం చూస్తాం."
-మిస్బా ఉల్ హక్, మాజీ సారథి.