ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ టెస్ట్ క్రికెట్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్లో టాస్మేనియాకు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. తన 18 ఏళ్ల బంధానికి ముగింపు పలికాడు. శుక్రవారం షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా క్వీన్స్‌ల్యాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం తన నిర్ణయాన్ని తెలిపాడు. ఇకపోతే పైన్ తన చివరి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 42 రన్స్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇకపోతే మ్యాచ్ అయిపోయిన అనంతరం అతడికి సహాచర ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.
టిమ్‌పైన్ 2005లో ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేశాడు. ఈ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో టిమ్‌పైన్(295).. టాస్మేనియా తరఫున అత్యధిక ఔట్లు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో మొత్తంగా 153 మ్యాచులు ఆడాడు. దాదాపు 30 సగటుతో 4వేలకు పైగా రన్స్ సాధించాడు.
2018 నుంచి 2021 వరకు ఆస్ట్రేలియా తరఫున 23 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన టిమ్ పైన్.. మొత్తంగా కెరీర్లో 35 టెస్టు మ్యాచులు ఆడాడు. 1,534 పరుగులు సాధించాడు. 2010లో లార్డ్ వేదికగా జరిగిన పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టులో అరంగేట్రం చేసిన అతడు.. 32.63 సగటుతో అత్యధిక వ్యక్తిగత స్కోరు 92 సాధించాడు టిమ్ పన్. అలాగే వికెట్ కీపర్‌గా 157 ఔటలు చేశాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో స్టీవ్ స్మిత్ తర్వాత అతడు ఆస్ట్రేలియాకు 46వ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అనంతరం 2021లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇకపోతే కెరీర్లో 35 వన్డేలు(890 రన్స్) , 12 టీ20లు కూడా ఆడాడు. అలానే 136 లిస్ట్-ఏ మ్యాచులు కూడా ఆడాడు.
"అతడు గొప్ప ప్లేయర్. అతడి ఆట అసాధారణం. చాలా కాలం పాటు తన శాయశక్తులా ఆడుతూనే ఉన్నాడు" అని టాస్మేనియా కెప్టెన్ జోర్డన్ సిల్క్ అన్నాడు. కాగా పైన్ కెరీర్లో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ముఖ్యంగా ఓ మహిళకు అభ్యంతరకర మెసేజీలు చేసిన 'సెక్స్టింగ్' స్కామ్‌లో ఇరుక్కున్నాడు. దీంతో అతడు 2021లో కీలకమైన యాషెస్ ఆసీస్ సిరీస్‌లో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ వివాదం అతడి కెరీర్‌నే మలుపు తిప్పేసింది.
ఇదీ చూడండి:ఇదేం అభిమానం గురూ.. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు చెట్లు ఎక్కి మరీ!