ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్(michael slater news) మైకేల్ స్లేటర్ అరెస్ట్ అయినట్లు సమాచారం. బుధవారం(అక్టోబర్ 20) ఈ సంఘటన జరిగినట్లు ఓ వార్త సంస్థ తెలిపింది. గృహహింస కేసులో(michael slater commentary) అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.
"గతవారం గృహహింస ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందింది. దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం ఉదయం అతడిని అరెస్ట్ చేశారు" అని పోలీసులు వెల్లడించినట్లు సదరు వార్త సంస్థ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.