తెలంగాణ

telangana

ETV Bharat / sports

78ఏళ్ల వయసులో దిగ్గజ​ క్రికెటర్​ రిటైర్మెంట్​

Ian Chappell Retirement: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ ఇయాన్​ చాపెల్​​.. తన 78వ ఏట రిటైర్మెంట్​ ప్రకటించారు. అయితే అది క్రికెట్​కు కాదు. తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నట్లు తెలిపారు.

Ian Chappell Retirement
ఇయాన్ చాపెల్​ రిటైర్మెంట్​

By

Published : Aug 15, 2022, 2:55 PM IST

Updated : Aug 15, 2022, 4:23 PM IST

Ian Chappell Retirement: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​, మాజీ కెప్టెన్​ ఇయాన్​ చాపెల్​ షాకింగ్ నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్​ను ఆశ్చర్యపరిచారు. సుదీర్ఘకాలంగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తనదైన శైలిలో కామెంటరీ​ చేస్తూ అభిమానులను అలరించిన ఆయన తాజాగా రిటైర్మెంట్​ ప్రకటించారు. 45ఏళ్లుగా వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఆయన.. ఆ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తెలిపారు. "క్రికెట్‌ నుంచి నేను తప్పుకోవాలని అనుకున్న రోజు ఇప్పటకీ నాకు బాగా గుర్తుంది. నా క్రికెట్‌ కెరీర్‌లో అఖరి రోజు వాచ్‌ చూశాను. టైమ్‌ 11 దాటింది. ఇక చాలు అని డిసైడయ్యాను. ఇక వ్యాఖ్యానం విషయంలోనూ అదే నిర్ణయం తీసుకున్నా" అని చాపెల్ పేర్కొన్నారు.

1964లో అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టిన ఆయన కెరీర్​లో 75 టెస్టులు(5345 పరుగులు, 20 వికెట్లు), 16 వన్డేలు(673 రన్స్, 2 వికెట్లు​) ఆడారు. 1971-1975వరకు జట్టుకు నాయకత్వం వహించారు. 1980లో ఆటకు రిటైర్మెంట్​ ప్రకటించి.. ఆ తర్వాత కామెంటేటర్​గా ఇప్పటివరకు కొనసాగారు.

ఇదీ చూడండి: ధోనీ విషయంలో బీసీసీఐ నిర్ణయంపై ఐపీఎల్​ ఫ్రాంచైజీలు అసహనం

Last Updated : Aug 15, 2022, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details