తెలంగాణ

telangana

By

Published : Feb 2, 2022, 8:33 PM IST

ETV Bharat / sports

'ఆధర్వ'గా ధోనీ.. ఫస్ట్​లుక్​తో ఫ్యాన్స్​ ఫుల్​ ఖుష్

Dhoni news: ఓవైపు ఐపీఎల్​ కోసం బిజీ అవుతున్న మహేంద్ర సింగ్ ధోనీ.. గ్రాఫిక్ నవల'ఆధర్వ' మోషన్​ పోస్టర్​, ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేశారు. ఈ నవలలో ధోనీని ప్రధాన పాత్రధారిగా కనిపించనున్నారు.

MS Dhoni Atharva novel
ధోనీ అధర్వ నవల

Dhoni novel: మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. మహీ కొత్త గెటప్​ చూసి ఫుల్​ ఖుషీ అయిపోతున్నారు. అదేంటి ఐపీఎల్​ ఇంకా ప్రారంభం కాలేదు. కొత్త గెటప్​ ఏంటా అని అనుకుంటున్నారా? మరేం లేదు ధోనీని ప్రధాన పాత్రగా 'అధర్వ' అనే నవల రాస్తున్నారు సంగీత దర్శకుడు రమేశ్ తమిళ్​మణి. ఇది గ్రాఫిక్ నవల. ఇందులోని ధోనీ ఫస్ట్​లుక్​ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో కత్తి పట్టి కిర్రాక్ లుక్​ కనిపిస్తున్నారు ధోనీ.

అధర్వ నవలలో ధోనీ ఫస్ట్​లుక్

ఈ గ్రాఫిక్ నవలను త్వరలో అమెజాన్​లో విక్రయించనున్నారు. ప్రీ ఆర్డర్ల ద్వారా దీనిని కొనుగోలు చేసే అవకాశముందని మోషన్ పోస్టర్​ చివర్లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో అనుసంధానం అయినందుకు చాలా థ్రిల్​గా ఉన్నానని ధోనీ చెప్పారు. ఆకర్షణీయమైన గ్రాఫిక్ నవల ఇది అని పేర్కొన్నారు.

Dhoni IPL: ప్రస్తుతం చెన్నైలో ఉన్న ధోనీ.. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరిగే మెగావేలం కోసం చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు తన విలువైన సూచనలు అందజేయనున్నాడు. గతేడాది సీఎస్కేను విజేతగా నిలిపిన మహీ.. మార్చి 27 నుంచి కొత్త ఐపీఎల్​ సీజన్​లో ఆ జోరు చూపించాలని భావిస్తున్నారు. ఈసారి స్వదేశంలోనే లీగ్​ నిర్వహించనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details