తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నెట్టింట్లో వామిక ఫొటోనా.. ఇప్పట్లో కష్టమే' - వామిక

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్​స్టా వేదికగా అభిమానులతో చిట్​చాట్​ చేశాడు. తన కూతురు ఫొటోను చూపెట్టాలంటూ కోరగా.. అందుకు విముఖత చూపాడు విరాట్. తనపై వచ్చే మీమ్స్​కు తన బ్యాటే మాట్లాడుతుందని తెలిపాడు.

virat kohli, team india cricketer
విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా క్రికెటర్

By

Published : May 29, 2021, 9:20 PM IST

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్​స్టా వేదికగా అభిమానులతో సరదాగా గడిపాడు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.

తన కూతురు 'వామిక' ఫొటోను చూపించాలని.. ఆ పేరుకు అర్థమేంటో చెప్పాలని ఓ అభిమాని కోరాడు. "వామిక అనేది దుర్గా దేవికి మరో పేరు. అనుష్క, నేను.. మా కూతురు ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టొద్దని నిర్ణయించుకున్నాం. సామాజిక మాధ్యమాలు అంటే ఏంటో వామికకు తెలిసేంత వరకు అలాగే ఉండాలనుకున్నాం. ఆ తర్వాత ఆమె ఇష్టం" అని కోహ్లీ సమాధానంగా చెప్పాడు.

ఇన్​స్టాలో కోహ్లీ

క్వారంటైన్​లో ప్రాక్టీస్ ఎలా గడుస్తుందని మరో అభిమాని కోహ్లీని ప్రశ్నించగా.. "రోజుకు ఒకసారి ట్రైనింగ్​లో పాల్గొంటున్నా. మిగిలిన సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నా" అని తెలిపాడు.

ఇన్​స్టాలో విరాట్

తనపై నెట్టింట వచ్చే మీమ్స్​, ట్రోల్స్​పై ఎలా సమాధానం చెప్తావని ఇంకో అభిమాని విరాట్​ను అడిగాడు. దీనికి తన బ్యాటే మాట్లాడుతుందంటూ అర్థం వచ్చేలా ఉన్న ఫొటోను పంచుకున్నాడు కోహ్లీ. ఓ అభిమాని కోరిక మేరకు తన చిన్ననాటి ఫొటోను కూడా పంచుకున్నాడు టీమ్ఇండియా కెప్టెన్.

చిన్ననాటి కోహ్లీ

ఇదీ చదవండి:శ్రీలంక బోర్డు వివాదం: క్రికెటర్లపై డిసిల్వా ఘాటు విమర్శలు

ABOUT THE AUTHOR

...view details