తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియాకు షాకిచ్చిన ఇంగ్లాండ్ మాజీ​ క్రికెటర్​ మృతి - ఇంగ్లాండ్​ మాజీ బౌలర్​ మైక్​ హెండ్రిక్​ మృతి

ఇంగ్లాండ్​ మాజీ పేస్​ బౌలర్​ మైక్​ హెండ్రిక్​(73) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలిపిన డెర్బిషైర్​ కౌంటీ క్రికెట్​ క్లబ్​.. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేసింది.

Hendrick
మైక్​ హెండ్రిక్

By

Published : Jul 28, 2021, 7:20 AM IST

Updated : Jul 28, 2021, 7:32 AM IST

ఇంగ్లాండ్​ మాజీ పేస్​ బౌలర్​ మైక్​ హెండ్రిక్(73)​ కన్నుమూశారు. ఈ విషయాన్ని డెర్బిషైర్​ కౌంటీ క్రికెట్​ క్లబ్​ ట్వీట్​ చేసింది. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించింది. టెస్టు​ కెరీర్​లో ఐదు వికెట్ల ప్రదర్శన లేకుండానే 87 వికెట్లు తీసిన ప్రపంచ రికార్డు ఆయన పేరిట ఉంది. అందులో 1974-1979 మధ్య కాలంలో భారత్​తో సిరీస్​ల్లో 26 వికెట్లు తీయడం విశేషం.

హెండ్రిక్​.. కెరీర్​లో 30టెస్టులు(87 వికెట్లు), 22 వన్డేలు(35), 267 ఫస్ట్​ క్లాస్​ మ్యాచ్​లు(770) ఆడాడు. ఐర్లాండ్​కు తొలి ఫ్రొఫెషనల్​ కోచ్​గా వ్యవహరించాడు. డెర్బిషైర్​ కౌంటీ క్రికెట్​ క్లబ్​ తరఫున ప్రాతినిధ్యం వహించారు.

1977, 1978-79 మధ్య జరిగిన యాషెస్ సిరీస్​​ గెలుపులోనూ భాగస్వామ్యం అయ్యాడు హెండ్రిక్​. 1974లో భారత్​తో జరిగిన సిరీస్​లో ఇంగ్లాండ్​ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. మూడో టెస్టు​లో 28 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇది ఆయన కెరీర్​లోనే​ బెస్ట్​ స్పెల్ కావడం విశేషం.

ఇదీ చూడండి:KL Rahul: నా వంతు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురుచూశా!

Last Updated : Jul 28, 2021, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details