ఇంగ్లాండ్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్.. 364 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ 129, రోహిత్ శర్మ 83 రాణించారు. చివర్లో జడేజా 40, పంత్ 37 పరుగులు చేసినప్పటికీ.. భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది.
పుజారా, రహానె విఫలం..
ఓపెనర్లు రోహిత్, రాహుల్ నిలకడగా ఆడారు. ఇంగ్లాండ్ పేస్ దళాన్ని ఎదుర్కొని.. తొలి వికెట్కు 126 పరుగులు జోడించారు. 83 పరుగులు చేసిన రోహిత్.. అండర్సన్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. అప్పటినుంచి జోరు పెంచిన రాహుల్.. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. పుజారా(9), రహానె(1) మరోసారి నిరాశపరిచారు. కోహ్లీ(42) మంచి ఆరంభాన్ని.. భారీ స్కోరుగా మలచలేకపోయాడు.
కొద్దిసేపు దూకుడుగా ఆడిన పంత్.. 37 పరుగులు చేసి వెనుదిరిగాడు. టెయిలెండర్లతో కలిసి జడేజా.. స్కోరు 350 దాటించాడు.