తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ashes 2023 : ఆసక్తికరంగా రెండో టెస్ట్.. ఆసీస్​కు ఇంగ్లాండ్​ లాస్ట్​ పంచ్​ ! - యాషెస్​ రెండో టెస్ట్ ఇన్నింగ్స్

యాషెస్‌ రెండో టెస్టు ఆసక్తికరంగా ఆరంభమైంది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టును కూడా మెరుగ్గా ఆరంభించింది. ఇక ఫామ్​లో దూసుకెళ్తున్న ఆసిస్​కు ఆఖరిలో ఇంగ్లాండ్​ గట్టి షాక్​ ఇచ్చింది. అదేంటంటే ?

ashes second test
ashes second test

By

Published : Jun 29, 2023, 7:24 AM IST

Ashes 2023 : లండన్​లోని లార్డ్స్​ క్రికెట్​ గ్రౌండ్​ వేదికగా..యాషెస్‌ రెండో టెస్టు ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్​లో తొలి టెస్టువిజేత ఆస్ట్రేలియా.. రెండో టెస్ట్​ను కూడా మెరుగ్గా ఆడి ఇంగ్లాండ్‌ జట్టుకు షాకిచ్చింది. ఈ క్రమంలో 74 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 315 పరుగులు సాధించి తిరుగులేని ఫామ్​లో నిలిచింది. అయితే ఆఖర్లో పుంజుకున్న ఆతిథ్య జట్టు 2 వికెట్లు పడగొట్టి పోటీకి వచ్చింది. ఈ క్రమంలో ఆట ఆఖరుకు వచ్చేసరికి ఆస్ట్రేలియా జట్టు.. 339/5తో నిలిచింది.

ఇక స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ దిశగా సాగుతుండగా.. ట్రావిస్‌ హెడ్‌ దూకుడైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లిష్‌ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. జట్టులోని మిగతా సభ్యులు డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌ కూడా తమదైన స్టైల్​లో రాణించారు. ఆట చివరికి స్మిత్‌కు తోడుగా అలెక్స్‌ కేరీ క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌ (2/88), జో రూట్‌ (2/19) సత్తా చాటారు.

బెడిసికొట్టిన వ్యూహం..
Ashes Second Test : బజ్‌బాల్‌ వ్యూహం బెడిసికొట్టి సొంతగడ్డపై ఓటమితో టెస్ట్​ను ఆరంభించిన ఇంగ్లాండ్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే తొలి రోజు ఆటలో ఆ జట్టుకు చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. ఉదయం వార్నర్‌ ధాటిగా ఆడి ఇంగ్లిష్‌ బౌలర్లను బెదరగొట్టాడు. అయితే ఓ ఎండ్‌లో ఖవాజా నెమ్మదిగా ఆడుతుంటే.. వార్నర్‌ బౌండరీల మోత మోగిస్తూ ఓ రేంజ్​లో దూసుకెళ్లాడు. అతను 66 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. అండర్సన్‌, బ్రాడ్‌లతో పాటు ఓలీ రాబిన్సన్‌.. ఓపెనర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. కానీ యువ పేసర్‌ జోష్‌ టంగ్‌.. మైదానంలోకి దిగి ఇంగ్లాండ్‌కు ఉపశమనాన్ని ఇచ్చాడు. లంచ్‌కు ముందు ఖవాజాను.. ఆ తర్వాత వార్నర్‌ను పెవిలియన్​ బాట పట్టించారు.

ముఖ్యంగా వార్నర్‌ను బౌల్డ్‌ చేసిన ఇన్‌స్వింగర్‌ తొలి రోజు ఆటలోనే హైలైట్‌. కానీ ఆ తర్వాత ఇంగ్లిష్‌ జట్టు నిలకడగా రాణించలేకపోయంది. తొలి టెస్టులో విఫలమైన స్టీవ్‌ స్మిత్‌ ఈసారి క్రీజులో పాతుకుపోయాడు. లబుషేన్‌ సైతం పట్టుదలతో ఉన్నాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 102 పరుగులు జోడించింది. లబుషేన్‌.. టీ తర్వాత రాబిన్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆపై ఇంగ్లాండ్‌ పరిస్థితి మాటల్లో చెప్పలేనిది. హెడ్‌ వన్డే తరహాలో ఆడుతూ పరుగుల వరద పారించి.. 48 బంతుల్లోనే 9 ఫోర్లతో అర్ధశతకం బాదేశాడు. ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు. హెడ్‌తో కలిసి స్మిత్‌ మరో శతక భాగస్వామ్యం నమోదు చేయడం వల్ల స్కోరు 300 దాటింది. తొలి రోజును గొప్పగా ముగించేలా కనిపించిన ఆసీస్‌కు జో రూట్‌ షాక్‌ ఇచ్చాడు. ఒకే ఓవర్లో హెడ్‌, గ్రీన్‌ (0)లను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత కేరీతో కలిసి స్మిత్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌:339/5 (వార్నర్‌ 66, ఖవాజా 17, లబుషేన్‌ 47, స్టీవ్‌ స్మిత్‌ 85 బ్యాటింగ్‌, హెడ్‌ 77, గ్రీన్‌ 0, కేరీ 11 బ్యాటింగ్‌; జోష్‌ టంగ్‌ 2/88, జో రూట్‌ 2/19)

ఇవీ చదవండి:

Ashes 2023 : ఆసిస్​, ఇంగ్లాండ్​ జట్లకు ఐసీసీ బిగ్​ షాక్​ !

Ashes 2023 : తొలి టెస్టులో ఇంగ్లాండ్‌కు నిరాశే.. ఆసీస్‌దే ఆఖరి పంచ్‌!

ABOUT THE AUTHOR

...view details