టీమ్ఇండియాతో మూడో టెస్టు తొలి రోజున అంపైర్ల నిర్ణయాలతో అసంతృప్తి చెందినట్లు ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ తెలిపాడు. 50-50శాతంగా ఉన్న అవకాశాల్లో వచ్చిన తీర్పులతో తీవ్ర నిరాశకు గురైనట్లు చెప్పాడు. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలను ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించగా.. అప్పీల్‌పై థర్డ్ అంపైర్ నాటౌట్‌గా తేల్చారు. ఈ నిర్ణయంపై క్రాలీ అసహనం వ్యక్తం చేశాడు.
"ఇది చాలా నిరాశ కలిగించింది. మేము ఆటలో వెనకబడి ఉన్నాం. 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు.. అవి మాకు అనుకూలంగా వస్తాయని ఆశిస్తాం. కానీ అలా జరగలేదు. అది బాధించింది. మేము బ్యాటింగ్ చేసేటప్పుడు జాక్ లీచ్ 'ఔట్ సందర్భాన్ని' 5,6 కోణాల్లో పరిశీలించారు. అదే మేము ఫీల్డింగ్ చేసే సమయంలో ఒకే కోణం(రోహిత్, గిల్)లో చూసినట్టు అనిపించింది. అందుకే అసంతృప్తిగా ఉన్నాం."