తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ వ్యాఖ్యలతో ఏకీభవిస్తా: మైఖేల్​ వాన్​

ఇంగ్లాండ్​తో జరిగిన రెండోటెస్టులో పిచ్​పై వచ్చిన రకరకాల ఊహాగానాలపై టీమ్ఇండియా క్రికెటర్​ రోహిత్​శర్మ స్పందించాడు. పిచ్​ల గురించి కాకుండా ఆటగాళ్ల ప్రదర్శనపై మాట్లాడాలంటూ రోహిత్​ సూచించాడు. అయితే రోహిత్​ వ్యాఖ్యలను తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైఖేల్​ వాన్​ అన్నాడు.

Michael Vaughan responds to Rohit Shama's message to Chennai pitch critics
రోహిత్​ వ్యాఖ్యలతో ఏకీభవిస్తా: మైఖేల్​ వాన్​

By

Published : Feb 22, 2021, 10:31 AM IST

చెన్నై పిచ్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గట్టి కౌంటర్‌ ఇవ్వడంపై ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ స్పందించాడు. రోహిత్‌ మాటలతో తాను పూర్తిగా ఏకీభవిస్తానని చెప్పాడు. ఇదే విషయాన్ని ట్వీట్టర్​లో వెల్లడించాడు.

మరోవైపు చెన్నై పిచ్‌పై స్పందించిన ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌.. స్వదేశంలో ఆడే జట్టుకు అక్కడి పరిస్థితులను సద్వినియోగం చేసుకునే సానుకూలత, హక్కు ఉంటుందని చెప్పాడు. అందులో తప్పేం లేదని, ఇంగ్లాండ్‌ జట్టు కూడా అలా ఆలోచించట్లేదని స్పష్టం చేశాడు.

ఏం జరిగిందంటే?

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో పిచ్‌ అనూహ్యంగా ఉందని, ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉందని వాన్‌తో సహా పలువురు మాజీలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే దానిపై పెద్ద చర్చ జరగడం వల్ల టీమ్‌ఇండియా ఓపెనర్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ దీటుగా బదులిచ్చాడు. పిచ్‌ల గురించి కాకుండా ఆటగాళ్ల ప్రదర్శనపై మాట్లాడాలంటూ రోహిత్‌ సూచించాడు. రెండు జట్లకూ పిచ్‌ సమానమేనని, మెరుగ్గా ఆడిన వాళ్లు గెలుస్తారని స్పష్టంచేశాడు.

"పిచ్‌ల గురించి ఎందుకింత చర్చ జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలంగా భారత్‌లో పిచ్‌ల స్వభావం ఇలాగే ఉంది. అందులో మార్పు రావాలని అనుకోవట్లేదు. స్థానిక పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి జట్టూ కోరుకుంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు మా గురించి ఎవరూ ఆలోచించరు. అలాంటప్పుడు ఇతర జట్ల గురించి మేమెందుకు ఆలోచించాలి? సొంతగడ్డపై సానుకూలత అంటే అదే. లేదంటే పూర్తిగా మార్చేయండి. ఎక్కడైనా పిచ్‌లన్నీ ఒకేలా ఉండేలా ఐసీసీ నిబంధనల్ని రూపొందించాలి. మేం విదేశాలకు వెళ్లినప్పుడు ప్రజల వ్యవహార శైలి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. పిచ్‌ల గురించి అసలు చర్చే అవసరం లేదని నేను అనుకుంటా."

- రోహిత్​ శర్మ, టీమ్ఇండియా వైస్​కెప్టెన్​

అలాగే ఆటగాళ్ల ప్రదర్శనలపై చర్చలు జరగాలని.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎలా చేస్తున్నారో చర్చించాలని హిట్‌మ్యాన్‌ సూచించాడు. రెండు జట్లూ ఒకే పిచ్‌పై ఆడతాయని, మెరుగ్గా ఆడిన జట్టే గెలుస్తుందని తెలిపాడు. టీమ్‌ఇండియా పిచ్‌ గురించి ఎప్పుడూ ఆలోచించదని, ఎక్కువ ఆలోచించినంత మాత్రాన పిచ్‌లేమీ మారవని అన్నాడు. మొతేరా పిచ్‌లో మార్పేమి కనిపించట్లేదని, రెండో టెస్టు మాదిరే ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. అందుకు తగ్గట్లుగానే సన్నద్ధమవుతున్నట్లు చెప్పాడు. ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగి చాలా రోజులైందని, పిచ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలని రోహిత్‌ అన్నాడు.

ఇదీ చూడండి:'స్వదేశంలో అనుకూల పిచ్​లు మామూలు విషయమే'

ABOUT THE AUTHOR

...view details