చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 337 పరుగులకు ఆలౌటైంది. 257/6తో నాలుగో రోజు ఆట కొనసాగించిన టీమ్ఇండియా మరో 21.5 ఓవర్లు మాత్రమే ఆడింది. మొదటి సెషన్లో కాసేపు ప్రతిఘటించిన అశ్విన్, వాషింగ్టన్ జోడీ జట్టును 300 పరుగుల మార్క్ దాటించారు. 80 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడీని స్పిన్నర్ లీచ్ విడగొట్టాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు భారత్ ఆలౌట్ - washington sunder
చెపాక్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఘోరంగా విఫలమైంది. పర్యాటక జట్టు దుమ్మురేపిన పిచ్‌పై మన బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్‌కు 241 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంకా 42 పరుగులతో వెనుకబడిన ఆతిథ్య జట్టు ఫాలో ఆన్‌లో పడింది.
తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు భారత్ ఆలౌట్
ఓ వైపు వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో అతనికి సహకారం అందించేవారు కరువయ్యారు. ఇంగ్లాండ్ జట్టుకు 241 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఇదీ చదవండి:'షాట్ల ఎంపికలో పంత్ తెలివిగా ఉండాలి'