తెలంగాణ

telangana

By

Published : Mar 2, 2021, 10:48 PM IST

ETV Bharat / sports

'నాలుగో టెస్టు పిచ్ కూడా​ అలానే ఉంటుంది'

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరగనున్న నిర్ణయాత్మక టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని టీమ్ఇండియా వైస్​కెప్టెన్​ అజింక్య రహానె అన్నాడు. గడచిన రెండు మ్యాచ్​ల్లో ఏ విధమైన పిచ్​ ఉందో.. నాలుగో మ్యాచ్​కు అలాంటి పిచ్​ ఉంటుందని పేర్కొన్నాడు.

IND vs ENG: No change in pitch conditions for fourth Test, says Ajinkya Rahane
నాలుగో టెస్టు పిచ్​ అలానే ఉంటుంది: రహనె

ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు పిచ్‌ ఎలా ఉంటుంది అనే దానిపై భారత వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె సంకేతాలు ఇచ్చాడు. రెండో టెస్టు, మూడో టెస్టు పిచ్‌ మాదిరిగానే నాలుగో టెస్టు పిచ్‌ ఉంటుందని రహానె పేర్కొన్నాడు.

రెండు, మూడు టెస్టుల్లో పిచ్‌ స్పిన్‌కు పూర్తిస్థాయిలో సహకరించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయఢంకా మోగించింది. మొతేరాలో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. మొతేరాలో బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమేకాని పిచ్‌ తప్పేమీ లేదని ఇప్పటికే రోహిత్‌ శర్మ, కోహ్లీ.. విమర్శలను కొట్టిపారేశారు.

పిచ్​పై వస్తున్న విమర్శలపై స్పందించిన రహానె.. విదేశాల్లో పర్యటించినప్పుడు తామెప్పుడూ పేసర్లకు అనుకూలించే పిచ్‌లపై ఫిర్యాదు చేయలేదని తెలిపాడు. నాలుగో టెస్టుకు కూడా మొతెరానే ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో పిచ్‌పై రహానె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రపంచకప్​కు సమానం

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ (డబ్లూటీసీ) నెగ్గడం కూడా ప్రపంచకప్​ను గెలిచిన దానికి సమానమన్న పేసర్​ ఇషాంత్ శర్మ వ్యాఖ్యలను వైస్​ కెప్టెన్​ రహానె ఏకీభవించాడు. "టెస్టు ఛాంపియన్​షిప్​పై ఇషాంత్​ శర్మ చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా. మా టీమ్​ అంతా ఇప్పుడు నాలుగో టెస్టులో విజయం సాధించి.. డబ్ల్యూటీసీ ట్రోఫీని గెలవడంపైనే దృష్టి పెట్టాం.'' అని అన్నాడు.

ఇదీ చూడండి:కోహ్లీ నెట్​ ప్రాక్టీస్​​.. కోచ్​తో రోహిత్​ చర్చ

ABOUT THE AUTHOR

...view details