చెపాక్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ ప్రభావమేమీ లేదని భారత సారథి కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
టీమ్ఇండియా.. ప్రత్యర్థి జట్టు కంటే మెరుగ్గా ఆడింది. టాస్ అనేది అంతగా ప్రభావమేమీ చూపలేదు. మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నట్లుగా పిచ్‌లో కూడా ఏమీ లేదు. అందుకు నాతో పాటు అశ్విన్ బ్యాటింగే నిదర్శనం. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మా జట్టు 600 పరుగులు చేసింది.
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్.
పర్యటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 134 పరుగులకే ఆలౌట్ అవ్వడం వల్ల.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చెపాక్ పిచ్ సుదీర్ఘ ఫార్మాట్‌కు పనికి రాదంటూ వ్యాఖ్యలు చేశాడు. కెవిన్ పీటర్సన్ కూడా భారత్ సాహసవంతమైన పిచ్‌ను తయారు చేసిందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
కానీ అదే పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన కోహ్లీ అర్ధ సెంచరీ చేయగా.. బౌలర్ అశ్విన్ ఏకంగా సెంచరీ సాధించాడు. కాస్త కుదురుకుంటే బ్యాటింగ్ అలవోకగా చేయవచ్చని వీరిద్దరూ విమర్శకుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.