తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇంగ్లాండ్​లో భారత్​ సాకులు చెప్పదు'

మొతేరా పిచ్​పై వస్తున్న విమర్శలను తప్పుబట్టాడు ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌. స్పిన్​ను ఎదుర్కోవడంలో పర్యాటక జట్టు విఫలమైందని, పిచ్​ తప్పిదమేమీ లేదన్నాడు. ఇక ఇంగ్లాండ్​లో పర్యటించినప్పుడు భారత్​ అలాంటి ఫిర్యాదులు చేయదని చెప్పాడు.

graeme swann backs motera pitch controversies saying india dont complain of seaming decks when playing in england
'ఇంగ్లాండ్​లో భారత్​ సాకులు చెప్పదు'

By

Published : Feb 27, 2021, 7:38 AM IST

ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు టీమ్‌ఇండియా పేస్‌ పిచ్‌లపై ఫిర్యాదులు చేయదని.. అలాంటప్పుడు స్పిన్‌ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లాండ్‌ జట్టును కాకుండా పిచ్‌ను విమర్శించడం ఏమిటని ఆ జట్టు మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ అన్నాడు. మొతేరా స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియా గురువారం 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌ కేవలం రెండు రోజుల్లోనే పూర్తవ్వడంపై పలువురు క్రికెటర్లు పిచ్‌ తీరును విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన స్వాన్‌.. టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు ఇలాంటి ఫిర్యాదులు చేయదని చెప్పాడు.

"ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కూడా ఒకింత బాగానే ఆడింది. అయితే, కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌లో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసింది. వచ్చేవారం జరగబోయే నాలుగో టెస్టుకు కూడా ఇలాంటి పిచ్చే ఉంటుంది. అందులో వేరే ఉద్దేశమే లేదు. ఇంగ్లాండ్‌ మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. మూడో టెస్టులాగే మళ్లీ తప్పులు చేయొద్దు. పిచ్‌ బాగా టర్న్‌ అవుతుందనే కొంటె సాకులు చెప్పొద్దు. అవన్నీ పనికిమాలిన మాటలు. ఇంగ్లాండ్‌ ఇంకా జాగ్రత్తగా ఆడాలి. అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే మరింత కష్టపడాలి. కోహ్లీ ఇలాగే చేశాడు. అండర్సన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి శక్తిమేరా శ్రమించాడు"

- గ్రేమ్‌ స్వాన్‌, ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌

ఇక ఈ విజయంతో టీమ్‌ఇండియా సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మార్చి 4 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది. భారత్‌ ఇది గెలిస్తే సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

ఇదీ చూడండి:మొతేరా పిచ్​పై మాజీల భిన్నాభిప్రాయాలు

ABOUT THE AUTHOR

...view details