తెలంగాణ

telangana

By

Published : Aug 4, 2021, 8:19 PM IST

Updated : Aug 4, 2021, 8:34 PM IST

ETV Bharat / sports

బుమ్రా, రూట్ రికార్డులు​.. టీ బ్రేక్​కు ఇంగ్లాండ్ స్కోరు 138/4​

భారత్​-ఇంగ్లాండ్​ తొలి టెస్టులో టీ విరామ సమయానికి రూట్​సేన 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో షమి 2, బుమ్రా, సిరాజ్​ తలో వికెట్ తీసుకున్నారు. క్రీజులో రూట్​ ఉన్నాడు.

India vs england
ఇండియా vs ఇంగ్లాండ్

నాటింగ్​హామ్​​లో భారత్​తో జరుగుతున్న తొలి టెస్టులో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్​ 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో షమి 2, బుమ్రా, సిరాజ్ ​తలో వికెట్ తీశారు. కెప్టెన్ రూట్​(52*) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

భోజన విరామ సమయానికి 61/2తో ఉన్న రూట్​సేన నిలకడగా ఆడింది. రెండో సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే సిబ్లీ(18) క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన బెయిర్​ స్టో సారథి రూట్​కు సహకరించాడు. ఈ జోడీ నాలుగో వికెట్​కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రారంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ క్రమంగా దూకుడు పెంచింది. చివర్లో చక్కటి బంతి ద్వారా షమి, బెయిర్​ స్టోను పెవిలియన్​కు పంపాడు.

రూట్​ రికాార్డు పరుగులు

తొలి ఇన్నింగ్స్​లో నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్​ కెప్టెన్ జో రూట్..​ సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్​ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు అలెస్టర్​ కుక్​ పేరిట ఉన్న మార్క్​ను అధిగమించాడు. కుక్​ 15,737 పరుగులు చేయగా.. రూట్​ ఈ మ్యాచ్​లో 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతన్ని దాటేశాడు.

బుమ్రా అరుదైన ఘనత..

టీమ్ఇండియా బౌలర్​ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును సృష్టించాడు. ఇంగ్లాండ్​ గడ్డమీద టెస్టుల్లో తొలి ఓవర్లోనే వికెట్​ తీసిన తొలి బౌలర్​గా ఘనత వహించాడు. తొలి ఓవర్​ ఐదో బంతికి ఓపెనర్​ రోరీ బర్న్స్​ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు బుమ్రా.

ఇదీ చదవండి:అక్టోబర్​ 24న భారత్‌- పాక్‌ మ్యాచ్

Last Updated : Aug 4, 2021, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details