England Test captain Ben Stokes: ఇంగ్లాండ్ టెస్టు సారథిగా బెన్ స్టోక్స్‌ను నియమించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. జో రూట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న నేపథ్యంలో అతడి స్థానంలో ఈ ఆల్‌రౌండర్ నియమిస్తూ ప్రకటన జారీ చేసింది. గత 17 టెస్టు మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సారథి జో రూట్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఈ క్రమంలోనే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు రూట్.
ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్... అతడికే పగ్గాలు..
Ben Stokes: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్టే.. టెస్టు జట్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌ను నియమించింది.
BEN STOKES england test captain
మాజీ ఇంగ్లాండ్ బ్యాటర్ రాబ్ కీ.. ఇంగ్లాండ్ బోర్డు పగ్గాలు చేపట్టిన వెంటనే కెప్టెన్సీపై నిర్ణయం తీసుకున్నారు. 'బెన్ స్టోక్స్.. టెస్టు పగ్గాలు స్వీకరించడానికి ఒప్పుకోవడం సంతోషకరం. జట్టును నడిపించేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. ఈ అవకాశానికి అతడు పూర్తిగా అర్హుడు. ఇంగ్లాండ్ టెస్టు జట్టును నూతన శిఖరాలకు తీసుకెళ్లాలని అనుకుంటున్నామ'ని రాబ్ చెప్పుకొచ్చారు.