టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) రెండుసార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్‌కు ఓటమి స్వాగతం పలికింది. బ్యాటర్లు విఫలమైన వేళ.. బౌలర్లు రాణించినప్పటికీ ఇంగ్లాండ్(ENG vs WI t20) చేతిలో ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 55 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఇంగ్లీష్ జట్టు తడబాటుకు గురైంది. ఛేదనలో 8.2 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 56 పరుగులు చేసి విజయం సాధించింది. జేసన్ రాయ్ (11), బెయిర్‌స్టో (9), మొయిన్ అలీ (3), లివింగ్ స్టోన్ (1) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. జోస్ బట్లర్ (24*), మోర్గాన్ (7)* నాటౌట్‌గా నిలిచారు. విండీస్ బౌలర్లలో హోసైన్ 2, రవి రాంపాల్ ఒక వికెట్ తీశారు. లక్ష్యం చిన్నదైనా వెస్టిండీస్ బౌలర్లు ఏ మాత్రం వెనుకాడలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. తొలుత బ్యాటింగ్‌లో మరికాస్త పరుగులు రాబట్టి ఉంటే విండీస్ గెలిచేందుకు అవకాశాలు ఉండేవి.
వచ్చిన దారినే వెళ్లారు..