తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​కు భారీ షాక్​.. డబ్ల్యూటీసీ పాయింట్లు, ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత - ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​

న్యూజిలాండ్​పై మరో టెస్టు మిగిలి ఉండగానే 2-0తో సిరీస్​ కైవసం చేసుకుంది ఇంగ్లాండ్. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇంగ్లీష్ జట్టు గెలిచిన సిరీస్​ ఇదే కావడం విశేషం. అయితే ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. రెండో టెస్టు అనంతరం ఆ జట్టు ఆటగాళ్లకు మ్యాచ్​ ఫీజులో 40శాతం కోత పడటమే కాక.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో రెండు పాయింట్లను కోల్పోయింది. ఎందుకంటే..

ఇంగ్లాండ్
ఇంగ్లాండ్

By

Published : Jun 16, 2022, 3:09 PM IST

న్యూజిలాండ్​తో రెండో టెస్టులో ఇంగ్లాండ్​ ఘన విజయం సాధించి సిరీస్​ను దక్కించుకుంది. 299 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్​ బ్యాటర్లు​ సునాయాసంగా ఛేదించిన తీరును చూసి క్రికెట్​ అభిమానులు ఆశ్చర్యపోయారు. గతేడాది జనవరి 2021 తర్వాత ఇంగ్లాండ్​ సిరీస్​ గెలవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఈ విజయం ఇంగ్లీష్​​ జట్టులో కొత్త జోష్​ నింపిందని అనుకుంటాం! కానీ, నిజానికి ఈ సిరీస్​తో ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో పాయింట్లను కోల్పోవడమే కాక.. ఆటగాళ్లు తమ మ్యాచ్​ ఫీజులోంచి 40 శాతాన్ని జరిమానాగా చెల్లించుకోవాల్సి వచ్చింది.

స్లో ఓవర్​ రేట్​: కివీస్​తో జరిగిన రెండో మ్యాచ్​లో స్లో ఓవర్​ రేటును నమోదు చేసింది ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు​. నిర్ణీత సమయంలో వేయాల్సిన వాటికంటే రెండు ఓవర్లు తక్కువ వేసింది. ఈ నేపథ్యంలో మ్యాచ్​ రిఫరీ రిచీ రిచర్డ్​సన్..​ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ టేబుల్​లో ఇంగ్లాండ్​కు రెండు పాయింట్ల కోత విధిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఈ విజయంతో 42కు చేరిన జట్టు పాయింట్లు మళ్లీ 40కి పడిపోయాయి. అంతేకాదు.. ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజు నుంచి 40 శాతం జరిమానా చెల్లించాలని ఆదేశించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. మూడు టెస్టుల సిరీస్​లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది ఇంగ్లాండ్. చివరిదైన మూడో టెస్టు జూన్ 23-27 మధ్య జరగనుంది.

ఇదీ చూడండి :బీసీసీఐ నయా ప్లాన్​.. ఇకపై 'వన్​ నేషన్​ టూ టీమ్స్​'గా!

ABOUT THE AUTHOR

...view details