Rahul Dravid Wriddhiman saha: టీమ్ఇండియా క్రికెటర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. అతడి మాటలు తననేమీ బాధించలేదని చెప్పాడు. ఇప్పటికీ అతడి పట్ల తన మనసులో గౌరవం అలానే ఉందని చెప్పాడు.
"అతడి మాటలు నన్నేమీ బాధించలేదు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు, ఆటగాడిగా అందుకున్న విజయాల పట్ల ఇప్పటికీ నా మనసులో అతడిపై గౌరవం అలానే ఉంది. ఆటగాళ్లతో ఎప్పుడూ మాట్లాడిట్లుగానే అతడితోనూ మాట్లాడాను. సాహాకు ఈ విషయంలో స్పష్టత అవసరం. అయినా ప్రతిసారి మనం ఇచ్చిన సలహాలు, సందేశాలు ప్రతి ఆటగాడికి నచ్చాలని లేదు కదా. అందుకే నేను ఎక్కువగా బాధపడలేదు. జట్టు ఎంపిక విషయంలో నేను లేదా కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్స్‌తో కచ్చితంగా మట్లాడతాం. వాళ్లని తుది జట్టు కోసం ఎందుకు ఎంపిక చేయలేదో అందుకు గల కారణాలను వివరిస్తాం. జట్టులో చోటు దక్కని వాళ్లు బాధపడటం సహజం."
-ద్రవిడ్, టీమ్ఇండియా హెడ్‌కోచ్.