న్యూజిలాండ్‌తో వన్టే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న శిఖర్ ధావన్‌పై టీమ్‌ఇండియా వికెట్‌కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ప్రశంసలు కురిపించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అతడు సెలెక్టర్లకు గొప్ప ఎంపిక అవుతాడని తెలిపాడు. ప్రపంచకప్ జట్టులో ఓపెనింగ్ బ్యాటర్‌గా రాణించేందుకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయన్నాడు.
"నాకెందుకో రానున్న ప్రపంచకప్‌లో శిఖర్ ధావన్ ఓపెనర్‌గా ఆడతాడని అనిపిస్తోంది. ఎందుకంటే ముప్పై ఏళ్లు దాటిన ఈ ఆటగాడిని పక్కనపెట్టడం చాలా తేలిక. కానీ, సెలెక్టర్లు అతడి చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను ఇవ్వడానికి సైతం వారు ఆసక్తి చూపారు. అతడు సందర్భానికి తగినట్లుగా తనను తాను మలచుకునే వ్యక్తి. ఆటలో స్థిరత్వం చూపుతాడు. 2019 ప్రపంచకప్ సమయంలోనూ గాయానికి ముందు అతడు ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒక్కసారిగా అతడు తన ఫామ్‌ను కోల్పోతే తప్ప.. జట్టులో కొనసాగడానికి పూర్తిగా అర్హుడు. ఓపెనింగ్ బ్యాటర్‌గా ధావన్ నమ్మదగిన వ్యక్తి. ఎందుకంటే, అతడికి గేమ్ ప్లాన్ తెలుసు. క్రీజును చక్కగా ఉపయోగించుకుంటాడు. అన్నింటికన్నా ముఖ్యంగా భారత టీ20 లీగ్‌కు ముందు అతడు కోరుకుంటున్నట్టుగా మరో మంచి అవకాశం దొరుకుతుంది" అని డీకే తెలిపాడు.