Dhoni helmet indian flag : క్రికెట్.. ఈ ఆటకు భారత దేశంలో ఎంతో క్రేజ్ ఉంది. ఓ మతంలా భావిస్తారు. కొంతమంది అభిమానులైతే.. తమ అభిమాన క్రికెటర్లను ఏకంగా దైవంగా భావిస్తారు. అలానే టీమ్ఇండియాలో స్టార్ ప్లేయర్లకు కొదవే లేదు. తమ ఆటతీరుతో. అలాగే తమ వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
సచిన్ తెందుల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇలా ఎంతో మంది ఈ జాబితాలోని వారే. వీరిలో కోహ్లీ, రోహిత్ ప్రస్తుతం టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. సచిన్, ధోనీ ఎప్పుడో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశారు. మహీ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన ఇంకా ఐపీఎల్లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే మహీ భాయ్ గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అభిమానులు దాన్ని ట్రెండ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా.. భారత జట్టుకు సేవలందించాడు. ముఖ్యంగా వికెట్‌కీపర్‌గా చెరగని ముద్ర వేశాడు. రెప్పపాటులో వికెట్లను గిరాటేసి.. మెరుపు రనౌట్లకు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు.
dhoni wicket keeper : అయితే ధోనీ నేషనల్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో.. అతడి హెల్మెట్‌ను గమనిస్తే.. దానిపై జాతీయ జెండా చిహ్నం కనపడదు. కానీ టీమ్‌లోని మిగిలిన ప్లేయర్స్ హెల్మెట్‌పై త్రివర్ణ పతాక చిహ్నం మాత్రం ఉంటుంది. మరి సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగిన మహీ హెల్మెట్‌పై జాతీయ జెండా చిహ్నం ఎందుకు లేదంటే.. దానికీ ఓ బలమైన కారణం ఉంది.