Dhoni Jersey to Pakistani Cricketer: భారత జట్టు కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఎప్పటికీ ప్రత్యేకమే. ఒక సారథిగానే కాదు.. మైదానంలో గొప్ప వ్యూహాకర్తగా, కీపర్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు. ఆటతోనే కాకుండా.. మైదానంలో సహచర ఆటగాళ్లు, ఇతర జట్ల క్రికెటర్లతో తాను వ్యవహరించే తీరుతో కోట్లాదిమంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అయితే ఇప్పుడు తన గొప్పమనసు, క్రీడాస్ఫూర్తిని మరోసారి చాటుకున్నాడు. ఈసారి పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్‌ను ఆశ్యర్యానికి గురిచేశాడు. సంతకం చేసిన తన ఐపీఎల్ జెర్సీని అతడికి బహుమతిగా పంపించాడు. ఈ విషయాన్ని రౌఫ్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
"దిగ్గజం, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ తన అందమైన జెర్సీని బహుమతిగా పంపించాడు. తన మంచి మనుసుతో నంబరు 7 ఇంకా హృదయాలను గెలుచుకుంటున్నాడు" అని రౌఫ్.. మహీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.