ఖాళీ సమయం దొరికిందంటే చాలు సామాజిక మాధ్యమాల్లో బిజీ అయిపోతుంటాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. తన పిల్లలు, సతీమణి కాండీస్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన చిత్రాల్లోని పాటలకు స్టెప్పులేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాల్లోని డైలాగ్‌లను పలుకుతాడు.
వార్నర్.. ఈ సారి టైగర్ ష్రాఫ్లా! - టైగర్ ష్రాఫ్గా వార్నర్
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా వ్యవహరించే ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. మరోసారి తన మార్కును చూపించాడు. పలు భారతీయ సినిమా పాటలకు డ్యాన్స్‌లేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వార్నర్.. ఈ సారి 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంలోని పాటకు చిందేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.
'రాములో రాములా', 'బుట్టబొమ్మా' పాటలకు కాలు కదిపి ఇటీవల తెలుగు వారికి దగ్గరైన వార్నర్.. ఈ మధ్యే 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అనే వ్యాఖ్యను ఇంగ్లీష్‌లో రాసి తన భార్యను ఎత్తుకున్నట్లు ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది ఆ పోస్టుని లైక్ చేశారు. తాజాగా వార్నర్ మరో భారతీయ పాటకు చిందేశాడు. కానీ, నిజంగా కాదు.. ఫేస్ స్వాప్ వీడియోలో. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంలోని పాటకు స్టెప్పులేశాడు. స్వాపింగ్ యాప్‌తో టైగర్ ష్రాఫ్ ముఖానికి బదులుగా తన ముఖాన్ని స్వాప్ చేసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ 'ఇదంతా అభిమానుల డిమాండ్ మేరకే' అంటూ క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. పోస్టు చేసిన ఐదు గంటల్లోనే 13 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.
ఇదీ చదవండి: