తెలంగాణ

telangana

ETV Bharat / sports

వారాల వ్యవధిలో ఆ క్రికెటర్ కుమార్తె, తండ్రి మరణం.. - vishnu solanki Daughter first and father now

vishnu solanki ranji cricketer కొద్ది రోజుల క్రితమే కుమార్తె మరణం.. విషాదం నుంచి తేరుకునే లోపే తండ్రి మరణం.. ఇలా వారాల వ్యవధిలో మనసు గాయపరిచే విషయాలు ఎదురైనా సరే ఆట మీద మక్కువతో బాధను దిగమింగుకుంటున్నాడు ఓ రంజీ క్రికెటర్. తండ్రి అంత్యక్రియలను వీడియో కాల్​ద్వారానే హాజరయ్యాడు. ఇంతలా బాధ అనిపించినా సరే, పరిస్థితులను తట్టుకుని తర్వాతి రంజీ మ్యాచ్​కు సిద్ధం అవుతున్నాడు.

vishnu solanki
విష్ణు సోలంకి

By

Published : Feb 28, 2022, 12:11 PM IST

vishnu solanki ranji cricketer కొద్ది రోజుల వ్యవధిలోనే కూతుర్ని, కన్న తండ్రిని పోగొట్టుకున్నాడు ఓ రంజీ క్రికెటర్. ఇటీవలే పుట్టిన కుమార్తె, ఆ తర్వాత రోజే తుదిశ్వాస విడిచింది. ఆ చిన్నారి అంత్యక్రియలకు హాజరై, వెంటనే తర్వాత మ్యాచ్​కు హాజరయ్యాడు. ఆ మ్యాచ్​లో సెంచరీ బాది కూతురికి అంకితమిచ్చాడు. ఆదివారం మళ్లీ ఆ ఆటగాడి జీవితంలో మరో విషాదం. అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి మరణించాడనే వార్త తెలిసింది. మార్చి 3న హైదరాబాద్​తో మ్యాచ్ ఉండడం వల్ల తన తండ్రి చివరి చూపుకు హాజరు కాలేకపోయాడు. వీడియో కాల్​లోనే తన తండ్రి అంత్యక్రియలను చూశాడు.

బరోడా బ్యాటర్ విష్ణు సోలంకికి కొన్ని రోజుల క్రితం కుమార్తె జన్మించింది. ఈ ఆనందం ఎంతో కాలం నిలవకుండానే అనారోగ్యంతో పాప మరణించింది. వార్త తెలుసుకున్న సోలంకి.. కుమార్తె అంత్యక్రియలకు హాజరయ్యాడు. అప్పటికే బెంగాల్​తో మ్యాచ్​కు దూరమైన అతడు.. తర్వాత చండీగఢ్​తో మ్యాచ్​కు జట్టులోకి వచ్చాడు. ఇంత బాధలోను ఈ మ్యాచ్​లో శతకం బాదాడు.

ఇప్పుడు తన తండ్రి అనారోగ్యంతో మరణించాడనే వార్త సోలంకికి తెలిసింది. మార్చి 3న హైదరాబాద్​ బరోడా తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ వీడియో కాల్​లోనే అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఇంతటి విషాదంలోనూ అతడికి ఆట పట్ల ఉన్న అంకితభావానికి పలువురు అభినందిస్తున్నారు.

గతంలో సచిన్, విరాట్​ కోహ్లీకి ఇలాంటి ఘటనలే ఎదురయ్యాయి. బ్రిస్టల్​లో మ్యాచ్ ఆడతుండగా సచిన్ తండ్రి మరణించారు. అంతటి బాధను దిగమింగుకుని ఆ మ్యాచ్​లో సచిన్ సెంచరీ బాదాడు. గతంలో విరాట్ కోహ్లీ తండ్రి కూడా కన్నుమూసిన సమయంలో, ఓ మ్యాచ్​లో 97 పరుగులు చేసిన తర్వాత విరాట్.. తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు.

ఇదీ చదవండి: పీఎస్​ఎల్​ విజేతగా లాహోర్​.. కెప్టెన్​గా షహీన్​ అఫ్రిది రికార్డు

ABOUT THE AUTHOR

...view details