దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వచ్చే ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో ముందుకు రానుంది. అయితే ఇది పేరుకే ప్రొటిస్ లీగ్ అయినా ఇందులో పాల్లొనబోయే ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే కొనుగోలు చేయడం విశేషం. అయితే ఇందులో జోహన్నెస్‌బర్గ్ జట్టును చెన్నై సూపర్‌కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం ధోనీని తమ మెంటార్‌గా నియమించనున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈ లీగ్‌లో భారత ఆటగాళ్లు భాగం కానున్నారా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి.
అయితే ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. భారత ఆటగాళ్లు ఎవరూ విదేశీ లీగ్‌లలో ఆడే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా అలా ఆడాలని కోరుకుంటే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ అయ్యాకే ఆడే ఛాన్స్ ఉంటుందని చెప్పారు.