ప్రస్తుతం దెహ్రాదూన్‌లో చికిత్స పొందుతున్న టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్‌ను తదుపరి ట్రీట్మెంట్ కోసం ముంబయికు తరలిస్తున్నట్లు డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. కారు ప్రమాదం తర్వాత తీవ్ర గాయాలపలైన పంత్‌ను దెహ్రాదున్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ అతడికి పలు శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు మొదట ఐసీయూలో ఉంచారు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించిన పంత్‌ను ఓ స్పెషల్ వార్డుకు తరలించారు. ఇప్పుడు ముంబయిలో తదుపరి చికిత్స అందించనున్నారు. అక్కడి లీలావతి ఆసుపత్రికి తరలించి అతడికి లిగ్మెంట్ చికిత్స అందించనున్నారని కాన్పుర్ ఎమ్మెల్యే ఉమేశ్ కుమార్ తెలిపారు.
'పంత్ కోలుకుంటున్నాడు.. తదుపరి చికిత్స నిమిత్తం ముంబయి తరలిస్తున్నాము' - రిషబ్ పంత్ హెల్త్ బులెటిన్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్రికెటర్ రిషభ్ పంత్‌ను తదుపరి ట్రీట్మెంట్ కోసం ముంబయికి తరలిస్తున్నట్లు డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.
Cricketer Rishabh pant
కాగా, ఇటీవలే తన వస్తువులను భద్రంగా తెచ్చి తిరిగి ఇచ్చిన ఇద్దరు యువకులను ఆస్పత్రిలో కలిశాడు పంత్. వారి నిజాయతీకి మెచ్చుకున్న పంత్ వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటో ప్రస్తుతం వైరలవుతోంది. అందులో కేవలం పంత్ చేయి మాత్రమే కనిపిస్తున్నప్పటికీ ఫ్యాన్స్.. 'ఇది చాలు తను కోలుకుంటున్నాడు అనడానికి అని'.. అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Jan 4, 2023, 12:18 PM IST