తెలంగాణ

telangana

ETV Bharat / sports

హెల్త్​ అప్డేట్​ ఇచ్చిన పంత్​.. ఇప్పుడెలా ఉందంటే? - పంత్ హెల్త్ అప్డేట్​

రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన భారత స్టార్​ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్​ ఇచ్చాడు. ఆ వివరాలు..

Panth tweet
హెల్త్​పై అప్డేట్​ ఇచ్చిన పంత్​.. ఇప్పుడెలా ఉందంటే?

By

Published : Feb 8, 2023, 4:17 PM IST

రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన భారత స్టార్​ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. దాదాపు 40 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పంత్.. తాజాగా తన ఆరోగ్యం గురించి అప్డేట్​ ఇచ్చాడు. బాల్కనీలో కూర్చున్న ఫొటోను తన ఇన్​స్టాలో షేర్ చేశాడు. ఇన్నాళ్లకు బయటకు వచ్చి స్వచ్చమైన గాలి పీల్చుకుంటున్నానని తెలిపాడు. ‘ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే ఇంత హాయిగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు’ అని క్యాప్షన్ రాసుకొచ్చాడు.

కాగా, డిసెంబర్ 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. తొలుత డెహ్రాడూన్​లోని హాస్పిటల్​లో చికిత్స పొందిన అతడిని ఆ తర్వాత ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించారు. చేరాడు. అక్కడ అతనికి రెండు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. అతడి మోకాళ్లకు శస్త్రచికిత్స కావడంతో తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అతడు ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇక ఈ ఆరు నెలల్లో అతడు పూర్తిగా కోలుకుని, ఫిట్​నెస్​ సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచ కప్​లో ఆడే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:ఎన్నో కష్టాలు దాటి.. క్రికెట్​ టీమ్​లకు కెప్టెన్లుగా నిలిచి..

ABOUT THE AUTHOR

...view details