ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బై ఆటగాడిగా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు భారత వర్ధమాన బౌలర్ నవదీప్ సైనీ. ఇది తన జీవితంలో మర్చిపోలేని ఘటన అని ఆనంద పడ్డాడు. రిషబ్ పంత్, అంబటి రాయుడులతో పాటు నవదీప్ సైనీ కూడా ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్లో బెంగళూరు తరఫున ఆడుతున్నాడీ 26 ఏళ్ల బౌలర్.
'ప్రపంచకప్‌లో అవకాశం వస్తే సత్తాచాటుతా' - worldcup
స్టాండ్ బై ఆటగాడిగా తనను ఎంపిక చేయడం పట్ల నవదీప్ సైనీ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో అవకాశం వస్తే మంచి ప్రదర్శన చేస్తానని తెలిపాడు సైనీ. ప్రస్తుతం ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
సైనీ
"ఐపీఎల్ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రపంచకప్‌లో స్టాండ్ బై ఆటగాడిగా ఎంపిక కావడాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఒకవేళ నాకు మెగాటోర్నీలో అవకాశం లభిస్తే మంచి ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నాను.-- నవదీప్ సైనీ, ఆర్సీబీ బౌలర్
ఇంగ్లండ్‌లో భారత ఆటగాళ్లకు నెట్ ప్రాక్టీస్ కోసం నలుగురు బౌలర్లను ఎంపిక చేసింది బీసీసీఐ. వారిలో నవదీప్ సైనీ ఉన్నాడు. భారత జట్టుతో కలిసి ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, దీపక్ చాహర్‌లతో పాటు సైనీ ఇంగ్లండ్ వెళ్లనున్నాడు.
Last Updated : Apr 20, 2019, 3:08 PM IST