విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్‌ను ప్రపంచకప్ జట్టుకు ఉపసారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది విండీస్ క్రికెట్ బోర్డు. ఈ జమైకన్ వీరుడు చివరగా 2010 జూన్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇన్నేళ్ల తర్వాత వైస్ కెప్టెన్‌గా కీలక బాధ్యతలు అప్పగించడంపై గేల్ సంతోషం వ్యక్తం చేశాడు. విండీస్ సారథిగా జాసన్ హోల్డర్ కొనసాగుతున్నాడు.
విండీస్ ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా గేల్ - west indies cricket
ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీలో వెస్టిండీస్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు క్రిస్‌గేల్. ఈ విషయాన్ని విండీస్ బోర్డు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
విండీస్ ప్రపంచకప్ జట్టుకు 'వైస్ కెప్టెన్'గా గేల్
"ఏ ఫార్మాట్లోనైనా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తా. వరల్డ్ కప్ టోర్నీ నాకు చాలా ప్రత్యేకమైనది. ఒక సీనియర్ ఆటగాడిగా కెప్టెన్‌కు , జట్టుకు సహకారం ఇవ్వడం నా బాధ్యత. ప్రపంచకప్ టోర్నీలో అంచనాలు భారీగానే ఉంటాయి. వెస్టిండీస్ ప్రజల కోసం మేమంతా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం"
-- క్రిస్ గేల్, వెస్టిండీస్ ఆటగాడు