తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​ ప్రపంచకప్​ సెమీస్​కు చేరడం ఖాయం' - worldcup

ఇంగ్లండ్​లో మే 30 నుంచి జరిగే ప్రపంచకప్​లో భారత్​ సెమీస్ చేరుతుందని శ్రీలంక మాజీ బౌలర్ చమిందావాస్ జోస్యం చెప్పాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా సత్తాచాటుతుందని విశ్వాసం వ్యక్తంచేశాడు. శ్రీలంక జట్టులో లసిత్ మలింగ కీలక ఆటగాడని చెప్పాడు.

చమిందావాస్

By

Published : Apr 23, 2019, 5:50 PM IST

ప్రపంచకప్​లో భారత్ సులభంగా సెమీస్​కు చేరుతుందని శ్రీలంక మాజీ పేస్​ బౌలర్ చమిందావాస్ జోస్యం చెప్పాడు. అన్ని విభాగాల్లో భారత జట్టు సమతూకంగా ఉందని అభిప్రాయపడ్డాడు. శ్రీలంక జట్టులో లసిత్ మలింగ కీలక ఆటగాడని తెలిపాడీ మాజీ దిగ్గజం.

"గత రెండు మూడేళ్లుగా భారత క్రికెట్ జట్టు అద్భుతంగా ఆడుతోంది. మంచి పేస్​ బౌలర్లు టీమిండియా సొంతం, ఎలాంటి సమయాల్లోనైనా మ్యాచ్ మలుపు తిప్పగలరు. నా అంచనా ప్రకారం టీమిండియా కచ్చితంగా సెమీస్ చేరుతుంది" -చమిందా వాస్, శ్రీలంక మాజీ ఆటగాడు.

శ్రీలంక జట్టు గత కొద్ది రోజులగా సరైన ప్రదర్శన చేయనప్పటికీ ప్రపంచకప్​లో​ సత్తా చాటుతుందని చమిందావాస్ అభిప్రాయపడ్డాడు. పదే పదే ఆటగాళ్లను మార్చడం శ్రీలంక జట్టు ప్రధాన సమస్య అని తెలిపాడు. మెగాటోర్నీలో శ్రీలంక సారథి కరుణ రత్నే తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇది చదవండి:అదో ప్రత్యేక అనుభూతి: రిషభ్ పంత్

ABOUT THE AUTHOR

...view details