తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వరల్డ్​కప్​ గెలవడానికి ఇదే సరైన సమయం' - AZHARUDDIN

ప్రపంచకప్​ గెలవడానికి భారత్​కిదే మంచి అవకాశమని మాజీ సారథి అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. జట్టు సమతూకంగా ఉందని, గెలవకుంటే నిరుత్సాహపడాల్సి వస్తుందని తెలిపాడు.

అజార్

By

Published : May 7, 2019, 10:24 PM IST

ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి జరగబోయే ప్రపంచకప్​లో భారత్ సత్తాచాటుతుందని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆకాంక్షించాడు. జట్టు సమతూకంగా ఉందని, కప్పు గెలవకపోతే నిరుత్సహాపడాల్సి వస్తుందని తెలిపాడు. రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టుకు ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు.

99 టెస్టులాడిన అజారుద్దీన్ 3 ప్రపంచకప్​ టోర్నీ​ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 1992, 1996, 1999లో జరిగిన మెగాటోర్నీల్లో ఆడాడు. కోహ్లీ ఐపీఎల్ ప్రదర్శన ప్రపంచకప్​పై ప్రభావం చూపదని ఆశిస్తున్నాడీ మాజీ సారథి.

ABOUT THE AUTHOR

...view details