ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీకి వర్షం ఆటంకం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. అయితే ఈ అంశంపై విశేషంగా స్పందింస్తున్నారు నెటిజన్లు. 'రెయిన్ వరల్డ్‌కప్' అంటూ మీమ్స్ పెడుతున్నారు.
WC19: వరల్డ్‌కప్ గెలిచేది.. వరుణుడంటా..!
ప్రపంచకప్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారడంపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. 'రెయిన్ వరల్డ్‌కప్' అంటూ సామాజిక మాధ్యమాల్లో విభిన్న రీతిలో మీమ్స్ పెడుతున్నారు.
'వరల్డ్‌కప్-2019 క్రికెట్ పోటీ కాదు.. స్విమ్మింగ్ కాంపిటీషన్' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'సెమీస్‌కు ఎవరు వెళ్లినా.. వెళ్లకపోయినా వర్షం మాత్రం చేరుతుంది' అని ఇంకొకరు స్పందించారు. 'వరల్డ్‌కప్‌ను వరుణుడే గెల్చుకుంటాడు' అని మరొకరు ట్రోల్ చేశారు. ఈ విధంగా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు నెటిజన్లు.
బ్రిస్టల్ వేదికగా జూన్ 7న జరగాల్సిన పాకిస్థాన్ - శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయింది. అనంతరం జూన్ 10న సౌథాంప్టన్ వేదికగా జరగాల్సిన దక్షిణాఫ్రికా - వెస్టిండీస్ మ్యాచ్ ఆగిపోయింది. మరుసటి రోజే బంగ్లాదేశ్ - పాకిస్థాన్ మ్యాచ్ కూడా టాస్ పడకుండానే నిలిచిపోయింది.