తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC 19: ప్రపంచకప్​ థ్రిల్లింగ్​ టాప్​-5 మ్యాచ్​లు ఇవే..! - india

ప్రపంచకప్​ మ్యాచ్​ల్లో ఓటమిదాకా వచ్చి గెలిచిన జట్లు చాలా ఉన్నాయి. 1983లో కపిల్​దేవ్​ అద్భుత శతకం, 1999 సెమీస్ మ్యాచ్​ టై అవ్వడం, 2015 సెమీస్​లో కివీస్​ విజయంలాంటివి ప్రపంచకప్​లో మరిచిపోలేనివి. ఇలా ఉత్కంఠభరితంగా సాగిన టాప్​-5 వరల్డ్​కప్​ మ్యాచ్​ల గురించి ఇప్పుడు చూద్దాం!

ప్రపంచకప్​

By

Published : May 26, 2019, 5:31 AM IST

ప్రపంచకప్​.. మ్యాచ్​లు సాదాసీదాగా జరిగితే కిక్కేముంటుంది. ఏదో వచ్చామా, కొట్టామా, వెళ్లామా అన్నట్టు కాకుండా థ్రిల్లింగ్​గా సాగి తమ అభిమాన జట్టు గెలిస్తే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మరి ప్రపంచకప్​లో ​అలా ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగి.. ఓడిపోవాల్సిన తరుణంలో గెలిచిన టాప్​-5 మ్యాచ్​లపై ఓ లుక్కేద్దాం.

గిల్మౌర్​ గ్రేట్​ డే...

1975 ప్రపంచకప్​లోచిరకాల ప్రత్యర్థులు​ ఇంగ్లాండ్​ - ఆస్ట్రేలియా మధ్య జరిగినఓ సెమీస్​ మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠంగా సాగింది. ఇందులో ఆసీస్ గెలిచింది. కంగారూ ఆటగాడు గ్యారీ గిల్మౌర్​ బౌలింగ్​తో (6/14) పాటు బ్యాటింగ్​లోనూ (28) మెరిశాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 93 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన కంగారూ జట్టు తడబడింది. 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్యారీ.. మరో కంగారూ బ్యాట్స్​మెన్​ డగ్​ వాల్టర్ సాయంతో నిలకడగా ఆడి ఆసీస్​ను ఫైనల్​ చేర్చాడు. ఈ మ్యాచ్​లో 28 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు గ్యారీ.

తుదిపోరులో వెస్టిండీస్ విజయం సాధించింది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు (11)తో పాటు ఎక్కువ పరుగులు (333) చేసిన ఆటగాడిగా గ్యారీ గిల్మౌర్ రికార్డు సృష్టించాడు.

కపిల్​దేవ్​ మరపురాని ఇన్నింగ్స్​..

1983 ప్రపంచకప్​ లీగ్ మ్యాచ్​లో జింబాబ్వేపై భారత్ అద్భుత విజయం సాధించింది. కపిల్​దేవ్ 175 పరుగులతో వీరోచితంగా పోరాడాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన కపిల్​ 138 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్​ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

తర్వాత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 233 పరుగులకు ఆలౌటైంది. కపిల్​దేవ్ విధ్వంసంతో జింబాబ్వేపై గెలిచిన భారత్ వారం తర్వాత ఫైనల్​లో విండీస్​ను ఓడించి తొలిసారి విశ్వవిజేతైంది.

1999లో ఆసీస్​ అదృష్టం

1999 ప్రపంచకప్​లోఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య ఓ సెమీస్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 213 పరుగులకు ఆలౌటైంది. ప్రొటీస్ బౌలర్ షాన్ పోలక్ 36 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. 214 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికాలో జాక్వెస్ కలిస్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. విజయానికి 39 పరుగుల అవసరం. 5 వికెట్లు చేతిలో ఉన్నాయి.

ఇలాంటి సమయంలో రనౌట్లతో వికెట్లు సమర్పించుకుంది దక్షిణాఫ్రికా. క్లుజెనర్ 16 బంతుల్లో 31 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా.. మ్యాచ్ టైగా ముగిసింది. కానీ సూపర్​ 6లో ఆస్ట్రేలియాతో ఓడిపోయిన సౌతాఫ్రికా నెట్​ రన్​రేట్​లో వెనుకబడింది. ఈ కారణంగా ఫైనల్​కు వెళ్లలేకపోయింది. తుదిపోరులో పాకిస్థాన్​ను ఓడించి రెండోసారి వరల్డ్​కప్​ నెగ్గింది కంగారూ జట్టు.

పసికూనపై ఇంగ్లాండ్ ఓటమి..

2011 ప్రపంచకప్​ లీగ్ మ్యాచ్​లో టెస్టు అర్హత కూడా లేని ఐర్లాండ్​పై పరాజయం చెందింది ఇంగ్లాండ్. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు​ 327 పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్ 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐరిష్ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ (113) శతకంతో అదరగొట్టాడు.

111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్​ను కెవిన్​ ఆదుకున్నాడు. సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ మ్యాచ్​లో 13 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు కెవిన్. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్​ రెండోసారి ప్రపంచకప్​ సొంతం చేసుకుంది.

మరోసారి దక్షిణాఫ్రికాను వెంటాడిన దురదృష్టం..

1996, 1999 ప్రపంచకప్​ల్లో దురదృష్టవశాత్తు టోర్నీ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా మరోసారి అదే పంథా కొనసాగించింది. 2015 వరల్డ్​కప్​ సెమీస్​లో న్యూజిలాండ్​పై పరాజయం చెందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్​లో కివీస్ ఆల్​రౌండర్​ గ్రాంట్ ఎలైట్ సఫారీ జట్టు​కు మ్యాచ్​ను దూరం చేశాడు.

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. డివిలియర్స్​, డుప్లెసిస్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. డక్​వర్త్​ లూయిస్ విధానం ద్వారా కివీస్​ 43 ఓవర్లలో 298 పరుగులు చేయాల్సి ఉంది.

న్యూజిలాండ్ గెలవాలంటే చివరి రెండు బంతులకు 5 పరుగులు చేయాలి. డేల్ స్టెయిన్ బౌలింగ్. ఇలాంటి పరిస్థితుల్లో కివీస్​ ఆల్​రౌండర్ ఎలైట్ సిక్సర్​ బాది జట్టును ఫైనల్ చేర్చాడు. ఈ మ్యాచ్​లో గ్రాంట్ ఎలైట్ (84) అర్ధశతకంతో అదరగొట్టాడు. ఆసీస్​తో జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్ ఓడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details