తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: అప్పుడు ఆల్​రౌండర్​... ఇప్పుడు అంపైర్

ప్రపంచకప్​ ఫైనల్​కు అంపైరింగ్ చేస్తున్న కుమార ధర్మసేన 1996లో విశ్వవిజేతగా నిలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు. ఇలా ఆల్​రౌండర్​ నుంచి అంపైర్​గా మారిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించాడు ధర్మసేన.

By

Published : Jul 14, 2019, 3:58 PM IST

కుమార ధర్మసేన

ప్రస్తుతం ఇంగ్లాండ్​ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్​కప్​ ఫైనల్​లో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్​కు అంపైరింగ్ చేస్తున్న కుమార ధర్మసేన ప్రపంచకప్​ ఛాంపియన్​గా నిలిచిన జట్టులో సభ్యుడు. 1996లో విశ్వవిజేతగా నిలిచిన శ్రీలంక జట్టులో భాగస్వామి.

ప్రపంచకప్ సభ్యుడై.. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్​కు అంపైరింగ్ చేస్తున్న ఏకైక వ్యక్తిగా కుమార ధర్మసేన కీర్తిగడించాడు. 48 ఏళ్ల ధర్మసేన 1993 నుంచి 2004 మధ్య లంక జట్టు తరఫున 141 వన్డేలు, 31 టెస్టులు ఆడాడు. ఆల్​రౌండర్​గా ఆకట్టుకున్నాడు. అనంతరం అంపైర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ఇది చదవండి: అప్పుడు సహచరులు... ఇప్పుడు ప్రత్యర్థులు

ABOUT THE AUTHOR

...view details