తెలంగాణ

telangana

ETV Bharat / sports

విలియమ్సన్ వీరోచిత శతకం- విండీస్ లక్ష్యం 292

మాంచెస్టర్ వేదికగా విండీస్​తో జరుగుతున్న మ్యాచ్​లో కివీస్ 6 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (148) శతకంతో విజృంభించగా... రాస్ టేలర్ (69) అర్ధసెంచరీ చేశాడు. విండీస్ బౌలర్లలో కాట్రెల్ 4 వికెట్లతో రాణించాడు.

విలియమ్సన్

By

Published : Jun 22, 2019, 10:15 PM IST

వెస్టిండీస్​తో ప్రపంచకప్​ 29వ మ్యాచ్​లో న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (148) శతకంతో రెచ్చిపోగా.. రాస్ టేలర్ (69) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. విండీస్ బౌలర్లలో కాట్రెల్ 4 వికెట్లు తీయగా.. క్రిస్ గేల్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కివీస్​కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే గప్తిల్ వికెట్ కోల్పోయింది. అదే ఓవర్ ఐదో బంతికి మున్రోను పెవిలియన్ చేర్చాడు కాట్రెల్. అనంతరం వచ్చిన విలియమ్సన్​- రాస్ టేలర్ ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టారు. మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు. వీరిద్దరూ 167 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

శతకంతో ఆకట్టుకున్న కివీస్ కెప్టెన్..

7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయీ పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విలియమ్సన్, టేలర్ ఆదుకున్నారు. కేన్ విలియమ్సన్ 154 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. రాస్ టేలర్ అర్ధశతకంతో రాణించాడు. 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గేల్ బౌలింగ్​లో హోల్డర్​కు క్యాచ్ ఇచ్చాడు టేలర్.

గోల్డెన్ డకౌట్లు చేసిన కాట్రెల్..

ఈ ప్రపంచకప్​లో నిలకడగా వికెట్లు తీస్తోన్న షెల్డాన్ కాట్రెల్ ఈ మ్యాచ్​లోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్​ తొలి ఓవర్లోనే ఓపెనర్లను (గప్తిల్, మున్రో) ఔట్​ చేశాడు కాట్రెల్. అనంతరం విలియమ్సన్​ (148), లాథమ్ (12) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆరంభంలో కివీస్​ను కట్టడి చేసిన విండీస్ బౌలర్లు ఆ తర్వాతపరుగులుధారళంగా సమర్పించుకున్నారు. కివీస్ బ్యాట్స్​మెన్​ల్లో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ మినహా మిగతా బ్యాట్స్​మెన్ ఆకట్టుకోలేకపోయారు. చివర్లో జేమ్స్ నీషమ్ (28) వేగంగా పరుగులు రాబట్టాడు.

ఇది చదవండి: కోహ్లీ ఖాతాలో 52వ అర్ధశతకం.. మరో రికార్డ్​ మిస్!

ABOUT THE AUTHOR

...view details