తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ - kiwis

మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్​తో మ్యాచ్​లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. విండిస్ జట్టులో రసెల్ స్థానంలో బ్రాత్​వైట్ ఆడనున్నాడు. ఎలాంటి మార్పుల్లేకుండానే కివీస్ సిద్ధమయింది.

విండీస్ - కివీస్

By

Published : Jun 22, 2019, 5:56 PM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న ప్రపంచకప్​ 29వ మ్యాచ్​లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్​ ఎం​చుకుంది. మాంచెస్టర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్​లో పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశముంది. ఈ వరల్డ్​కప్​లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​లోనూ కివీస్​ ఓడలేదు. మరోవైపు సెమీస్ ఆశలు మిగిలుండాలంటే విండీస్ ఈ మ్యాచ్​లో తప్పక గెలవాల్సిందే.

జట్టులో మూడు మార్పులతో బరిలో దిగింది వెస్టిండీస్ జట్టు. మోకాలి గాయం కారణంగా రసెల్​ మ్యాచ్​కు దూరమయ్యాడు. అతని స్థానంలో బ్రాత్​వైట్​ ఆడనున్నాడు. డారెన్ బ్రావో, గాబ్రియేల్ స్థానాల్లో నర్స్​, కీమర్ రోచ్​కు అవకాశం కల్పించింది విండీస్ జట్టు.

ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలో దిగుతోంది కివీస్ జట్టు. 5 మ్యాచ్​లు ఆడిన న్యూజిలాండ్ నాలుగింటిలో గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇందులో విజయం సాధించి సెమీస్ ఆశలు పదిలంగా ఉంచుకోవాలని యోచిస్తోంది విండీస్.

జట్లు

న్యూజిలాండ్:

కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో, రాస్ టేలర్, టామ్ లాథమ్ (కీపర్), నీషమ్, గ్రాండ్​హోమ్, మిషెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్​

వెస్టిండీస్​:

హోల్డర్​ (కెప్టెన్), క్రిస్ గేల్, లూయిస్, షాయ్ హోప్ (కీపర్), నికోలస్ పూరన్, హిట్మైర్​, బ్రాత్​వైట్, నర్స్, థామస్, కీమర్ రోచ్, కాట్రెల్​.

ABOUT THE AUTHOR

...view details