తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిజర్వ్​ డేలోనూ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి? - CWC19

సెమీస్​ మ్యాచ్​కు వర్షం కురిసే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే బుధవారం రిజర్వ్​ డే ఉంది. అప్పుడూ వర్షం పడితే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న తలెత్తుతుంది.

రిజర్వ్​ డేలో వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి?

By

Published : Jul 9, 2019, 6:00 AM IST

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరగబోయే సెమీస్ మ్యాచ్​ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ సెమీస్ సంగ్రామానికి వరణుడు అడ్డుపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

బ్రిటిష్ వాతావరణ శాఖ అంచనా ప్రకారం మంగళవారం వర్షం కురిసే అవకాశముంది. అయితే సెమీస్​, ఫైనల్ మ్యాచ్​లకు రిజర్వ్​ డే ఉంది కాబట్టి ఎలాంటి సమస్య లేదు. కానీ రిజర్వ్​ డే లోనూ వర్షం కురిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? .

సెమీస్​ రోజు వర్షం కురిస్తే దాదాపు అదే రోజు మ్యాచ్​ ముగించేందుకు ప్రయత్నిస్తారు. ఓవర్లు తగ్గించి డక్​ వర్త్ లూయిస్ విధానం ద్వారా ఫలితం తేలుస్తారు. అసలు మ్యాచ్​ జరపడమే కుదరకపోతే రిజర్వ్ డే ఉంటుంది. బుధవారం ఆ మ్యాచ్​ నిర్వహిస్తారు.

మాంచెస్టర్ మైదానంలో వాతావరణం

రిజర్వ్​ డేలోనూ వర్షం కురిస్తే.. భారత్​ ఫైనల్​కు

దురదృష్టవశాత్తు రిజర్వ్​ డేలోనూ వర్షం పడితే అప్పుడు రిఫరీ... లీగ్​ దశలో ఇరు జట్ల విజయాల ఆధారంగా మ్యాచ్​ ఫలితం తేలుస్తాడు. ఆ రకంగా చూసుకుంటే మంగళవారం భారత్​ - న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్​కు అంతరాయం ఏర్పడితే బుధవారం మ్యాచ్​ నిర్వహిస్తారు. అప్పుడూ అడ్డంకి ఏర్పడితే రెండు జట్లలో ఎక్కువ విజయాలు సొంతం చేసుకుని 15 పాయింట్ల అగ్రస్థానంలో ఉన్న భారత్​ ఫైనల్​కు చేరుతుంది.

ఇది చదవండి: WC19: కివీస్​తో పోరుకు భారత్​ ఇస్మార్ట్ ప్లాన్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details