తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​పై విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది' - kiwis

భారత్​తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్​లో న్యూజిలాండ్ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారని, ఈ మ్యాచ్​లో గెలవడం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఆ దేశ బౌలర్​ ట్రెంట్ బౌల్ట్​ తెలిపాడు.

ట్రెంట్ బౌల్ట్​

By

Published : May 26, 2019, 12:46 PM IST

లండన్ వేదికగా భారత్​తో జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో గెలవడం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్​ బౌల్ట్​ తెలిపాడు. ప్రారంభంలోనే వికెట్లు తీయడం తమకు కలిసొచ్చిందని చెప్పాడు. ఈ మ్యాచ్​లో బౌల్ట్​ 33పరుగులిచ్చి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

" బ్యాటింగ్​కు అనుకూలిస్తుందనుకున్న పిచ్​పై బంతి కొంచెం స్వింగవడం మాకు కలిసొచ్చింది. బంతి స్వింగ్ అవుతున్నప్పుడే కాకుండా ఏ పరిస్థితుల్లోనైన వికెట్లు తీయడాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ అంశంపై దృష్టిపెట్టాం. భారత్​పై విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే రోజుల్లో ఇలాగే ఆకట్టుకోవాలనుకుంటున్నాం"

- ట్రెంట్ బౌల్ట్​ కివీస్ బౌలర్

శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్​లో భారత్ 179 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్​ బౌలర్లు బౌల్ట్​ నాలుగు, జేమ్స్​ నీషమ్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత బ్యాట్స్​మెన్​ల్లో జడేజా మినహా మిగతా వారు పెద్దగా రాణించలేదు. అనంతరం న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ABOUT THE AUTHOR

...view details