తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: కివీస్​తో పోరుకు భారత్​ ఇస్మార్ట్ ప్లాన్​ - india

ప్రపంచకప్​ సెమీస్​లో న్యూజిలాండ్​తో తలపడనుంది టీమిండియా. ఈ పోరులో గెలిచి ఫైనల్​లో అడుగుపెట్టాలని భావిస్తోంది. అదెలా సాధ్యం? అందుకోసం ఎలాంటి ప్రణాళిక అనుసరించాలి? క్రికెట్ పండితుల మాటేంటి?

మ్యాచ్

By

Published : Jul 8, 2019, 4:57 PM IST

ప్రపంచకప్​ టైటిల్​ గెలుపునకు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది భారత జట్టు. సెమీస్​లో మంగళవారం మాంచెస్టర్​ వేదికగా న్యూజిలాండ్​తో తలపడబోతోంది. ప్రపంచకప్​ ప్రారంభంలో వరుస విజయాలతో ఊపు మీద కనిపించిన కివీస్.. చివర్లో హ్యాట్రిక్ ఓటములతో నిరాశలో కూరుకుపోయింది. అయినా ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కోహ్లీసేన సరైన ప్రణాళికతో విలియమ్స​న్​ సేనకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది.

ఆరుగులు బౌలర్లు

న్యూజిలాండ్​తో జరిగే మ్యాచ్​లో కోహ్లీసేన ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని క్రికెట్ పండితులు సూచిస్తున్నారు. బుమ్రా, భువనేశ్వర్​తో పాటు షమీ జట్టులో ఉంటే బౌలింగ్​ విభాగంలో పటిష్ఠంగా నిలవొచ్చు. డెత్​ ఓవర్లలో షమీ అంత ప్రభావం చూపించలేకపోతున్నాడు. అందువల్ల అతడిని ప్రారంభంలో కొన్ని ఓవర్లు వేయించి మిడిల్​ ఓవర్లలోనూ బంతిచ్చి కివీస్​ బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయించాలి. పాండ్య నాలుగో పేసర్​గా ఉండనే ఉన్నాడు. కుల్దీప్, చాహల్​లో ఒక మణికట్టు స్పిన్నర్​తో పాటు జడేజాతో స్పిన్ కోటాను పూర్తి చేయిస్తే మంచిది.

టీమిండియా

జట్టులో జడేజా ఉండాలి

శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో జడేజా బంతితో రాణించాడు. ప్రపంచకప్​లో మొదటి మ్యాచ్​ ఆడి తన విలువేంటో నిరూపించాడు. బౌలింగ్ కోటాను వేగంగా.. పరుగులను నియంత్రిస్తూ పూర్తి చేయగలడు. అలాగే జడేజా అద్భుత ఫీల్డర్. ఏడో స్థానంలో నమ్మదగ్గ బ్యాట్స్​మెన్​ కూడా.

జడేజా

ఓపెనర్లు అటాకింగ్ మోడ్​లో...

ధావన్ గాయంతో ప్రపంచకప్​ నుంచి వైదొలగగా రోహిత్​తో కలిసి రాహుల్ ఓపెనర్​గా బరిలోకి దిగుతున్నాడు. వీరిద్దరూ మొదటి పవర్ ప్లేలో కాస్త నెమ్మదిగా ఆడుతున్నారు. ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో మొదటి పది ఓవర్లలో 28 పరుగులు మాత్రమే సాధించారు. ఆ తర్వాత బంగ్లాదేశ్​, శ్రీలంక మ్యాచ్​ల్లో కాస్త దూకుడు పెరిగింది. రోహిత్ వరుస సెంచరీలతో జోరు మీద ఉండగా.. రాహుల్ లంకపై శతకం పూర్తి చేశాడు. ఇదే ఊపుతో సెమీస్​లో కివీస్ బౌలర్లపై మొదటి పవర్ ప్లే ఆధిపత్యం చెలాయిస్తే టీమిండియాకు తిరుగుండదు. ముఖ్యంగా ఫామ్​లో ఉన్న బౌల్ట్​ కొత్త బంతితో ప్రమాదకరం.

రోహిత్, రాహుల్

విలియమ్స్​న్​ను కట్టడి చేయాలి

విలియమ్సన్​ను కట్టడి చేయడానికి టీమిండియా వద్ద తగిన ప్రణాళికలు ఉండాలి. ఆసీస్​తో జరిగిన మ్యాచ్​లో స్టార్క్ కివీస్​ సారథిని కట్టడి చేసిన విధంగా కోహ్లీ.. బుమ్రాతో తగిన వ్యూహాలు పన్నాలి​. కివీస్ ఓపెనింగ్​లో వరుసగా విఫలమవుతున్నారు. టాపార్డర్​ను వీలైనంత తొందరగా పెవిలియన్ పంపడానికి టీమిండియా కృషి చేయాలి.

విలియమ్సన్

ఇవీ చూడండి.. WC19: గతం అనవసరం.. విరాట్​తో రోహిత్​

ABOUT THE AUTHOR

...view details