ప్రపంచకప్ జట్టులో ఎంపిక కాకపోవడం వల్ల అంబటి రాయుడు చేసిన 3డీ ట్వీట్ కొద్ది రోజుల క్రితం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై విజయ్‌శంకర్ స్పందించాడు. రాయుడు ఈ ట్వీట్తనను ఉద్దేశించి చేసింది కాదన్నాడు.
ఓ క్రికెటర్‌గా రాయుడు పరిస్థితి అర్థం చేసుకుంటానని, జట్టులోకి ఎంపికకాకపోతే సదరు ఆటగాడు ఎంత బాధపడతాడో తనకు తెలుసని రాయుడుకు మద్దతుగా మాట్లాడాడు విజయ్ శంకర్. రాయుడు చేసిన ట్వీట్ తన గురించి కాదని ఓ టీవి షోలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
గత నెలలో ప్రపంచకప్ జట్టుకు 15 మందిని ఎంపికచేశారు సెలెక్టర్లు. అంబటి రాయుడు స్థానంలో విజయ్‌శంకర్‌కు అవకాశమిచ్చారు. విజయశంకర్ త్రి డైమెన్షనల్ ఆటగాడని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లతో మూడు రకాలుగా ఉపయోగపడతాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఈ అంశంపై స్పందించిన రాయుడు తాను త్రీడీ కళ్లద్దాలు ఆర్డరిచ్చానని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌తో విజయ్‌శంకర్‌కు రాయుడు పరోక్షంగా సెటైర్ వేశాడని వార్తలొచ్చాయి. ఈ విషయంపై ఇద్దరు ఆటగాళ్లు అప్పుడు స్పందించలేదు.
ఇది చదవండి:ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ టాప్ ఆర్డర్ విఫలం