తెలంగాణ

telangana

By

Published : May 31, 2019, 8:29 AM IST

ETV Bharat / sports

WC19: ప్రపంచకప్​లో 'బెన్​ స్టోక్స్​' సూపర్​ క్యాచ్

ప్రపంచకప్​ ఆరంభ మ్యాచ్​లో తనదైన ఆటతీరుతో మెప్పించాడు ఇంగ్లాండ్​ ఆటగాడు బెన్​స్టోక్స్​. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో అద్భుతమైన క్యాచ్​ పట్టి ప్రశంసలు పొందుతున్నాడు.

ప్రపంచకప్​లో 'బెన్​ స్టోక్స్​' సూపర్​ క్యాచ్

వరల్డ్​కప్ 2019​ ఆరంభంలోనే ఆతిథ్య ఇంగ్లాండ్​ గెలుపు సొంతం చేసుకుంది. ఓవల్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్​లో 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ ఆటలో బెన్​స్టోక్స్​ ఆల్​రౌండర్​ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​ అందుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఆండిలే పెహ్లుక్​వాయో కొట్టిన బంతిని... బౌండరీ లైన్​​ వద్ద కళ్లు చెదిరే రీతీలో అందుకోవడం​ ఆటకే హైలైట్​.

అద్భుతమైన క్యాచ్ అందుకున్న స్టోక్స్​

తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లలో బెన్​స్టోక్స్​ 79 బంతుల్లో 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా రెండు వికెట్లు తీసి బౌలింగ్​లోనూ అదరగొట్టాడు.
ఈ సూపర్​ క్యాచ్​పై మ్యాచ్​ అనంతరం స్పందించిన ​స్టోక్స్​​.. ఇదేమి తన బెస్ట్​ క్యాచ్​ కాదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి మెరుగైన ప్రదర్శనతో జట్టు మరిన్ని విజయాలు సాధించేందుకు తోడ్పడతానని వెల్లడించాడు.​

ఇవీ చూడండి... WC19: ప్రపంచకప్​ బోణి ఆతిథ్య ఇంగ్లండ్​దే

ABOUT THE AUTHOR

...view details