ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్‌వెల్ మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. బెరెన్‌డార్ఫ్ వేసిన 42వ ఓవర్ రెండో బంతిని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ వోక్స్ క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా పట్టుకుని ఫించ్‌కు విసిరాడు. మరో వైపు బెన్ స్టోక్స్‌ను కళ్లు చెదిరే యార్కర్‌తో బౌల్డ్ చేశాడు స్టార్క్.
అద్భుతమైన ఫీల్డింగ్..
డీప్ మిడ్ వికెట్ వైపుగా వోక్స్ భారీ షాట్ ఆడాడు. అందరూ సిక్సర్ అని భావించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్‌వెల్ అమాంతం గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే అదుపుతప్పిన మ్యాక్సీ ఆ బంతిని ఫించ్ వైపు విసిరి బౌండరీ లైన్‌ను క్రాస్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఫించ్ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. నిరాశ చెందిన క్రిస్ వోక్స్ పెవిలియన్‌కు చేరాడు. చాకచక్యంతో మెరుపు ఫీల్డింగ్ చేసిన మ్యాక్స్‌వెల్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.