తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​కు శ్రీలంక షాక్​... ఉత్కంఠపోరులో విజయం - worldcup

శ్రీలంక - ఇంగ్లాండ్

By

Published : Jun 21, 2019, 2:40 PM IST

Updated : Jun 21, 2019, 10:54 PM IST

2019-06-21 22:41:25

ఇంగ్లాండ్​పై అద్భుత విజయం సాధించిన లంక

సెమిస్​ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో శ్రీలంక సత్తా చాటింది. అతిథ్య ఇంగ్లాండ్​పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో ఎట్టకేలకు లంకనే విజయం వరించింది. 4 వికెట్లతో చెలరేగిన సీనియర్ పేసర్ లసిత్​ మలింగ లంకేయుల విజయంలో కీలక పాత్ర పోషించాడు. ధనంజయ డిసిల్వా 3 వికెట్లతో ఆకట్టకున్నాడు. ఇసురు ఉడాన రెండు, నువాన్​ ప్రదీప్​ ఒక వికెట్​ దక్కించుకున్నాడు. 

ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​లో ఆల్​రౌండర్​ స్టోక్స్​ అద్భుత పోరాటపటిమ ప్రదర్శించాడు. చివరి వరకు  అజేయంగా నిలిచిన స్టోక్స్​ మోర్గాన్​ సేనను విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు. అయితే పదో వికెట్​గా మార్క్​ వుడ్ వెనుదిరిగినందున ఇంగ్లాండ్​ పోరాటానికి తెరపడింది.

2019-06-21 22:21:46

మరో వికెట్​ చేజార్చుకొన్న ఇంగ్లాండ్...

శ్రీలంక మ్యాచ్​లో పట్టు బిగించింది. తొమ్మిదో వికెట్​ తీసి ఇంగ్లాండ్​ను ఒత్తిడిలోకి నెట్టింది. జోఫ్రా ఆర్చర్​ను (3) ఉదానా పెవిలియన్​కు పంపాడు. ఇంగ్లాండ్​ ఇంకా 38 బంతుల్లో 47 పరుగులు చేయాల్సి ఉంది.

2019-06-21 22:04:12

ఒకే ఓవర్లో రెండో వికెట్​...

41 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు. డిసిల్వా ఒకే ఓవర్లో క్రిస్​ వోక్స్​, అదిల్​ రషీద్​ వికెట్లను తీశాడు. మరో ఎండ్​లో బెన్​ స్టోక్స్​ అర్ధశతకంతో పోరాడుతున్నాడు.

2019-06-21 21:57:28

కష్టాల్లో ఇంగ్లాండ్​...

స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్​ వికెట్లు పోగొట్టుకుంటోంది. ఓ వైపు స్టోక్స్​ అర్ధశతకంతో రాణిస్తోన్నా మరో ఎండ్​లో వికెట్లు కోల్పోతోంది. 40వ ఓవర్​ తొలి బంతికి క్రిస్​ వోక్స్​ను ఇంటికి పంపాడు డిసిల్వా.

2019-06-21 21:33:49

సూపర్​ క్యాచ్​తో మొయిన్​ ఔట్​...

38వ ఓవర్​ 3వ బంతికి భారీ షాట్​కు యత్నించి ఔటయ్యాడు మొయిన్​. బౌండరీ లైన్​ వద్ద అద్భుతమైన క్యాచ్​ పట్టాడు ఉదానా. మరో ఎండ్​లో స్టోక్స్​ నెమ్మదిగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్​ విజయానికి 69 బంతుల్లో 63 పరుగులు అవసరం.

2019-06-21 21:27:43

ఎల్బీగా ఔటైన బట్లర్​...

9 బంతుల్లో 10 పరుగులతో నెమ్మదిగా జోరందుకుంటున్న బట్లర్​ను ఔట్​ చేశాడు మలింగ. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు ఈ హిట్టర్​. ఫలితంగా అయిదో వికెట్​ కోల్పోయింది ఇంగ్లీష్​ జట్టు.  33 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది మోర్గాన్​ సేన.

2019-06-21 21:16:19

నాలుగో వికెట్​గా వెనదిరిగిన రూట్​...

89 బంతుల్లో 57 పరుగులతో క్రీజులో ఉన్న రూట్​ను పెవిలియన్​ చేర్చాడు మలింగ. ప్రస్తుతం స్టోక్స్​ 32 పరుగులతో నాటౌట్​గా ఉన్నాడు. బట్లర్​ క్రీజులోకి వచ్చాడు.

2019-06-21 20:55:29

అర్ధ శతకంతో రాణిస్తున్న రూట్​..

ప్రదీప్​ వేసిన 26వ ఓవర్​ 4వ బంతికి ఇంగ్లాండ్​ 100 పరుగుల మార్కు దాటింది. 24 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది ఇంగ్లీష్​ జట్టు. రూట్​ 51 పరుగులు, స్టోక్స్​ 14 రన్స్​తో క్రీజులో ఉన్నారు.

2019-06-21 20:31:53

ఇంగ్లాండ్​ను అడ్డుకుంటున్న లంకేయులు...

233 పరుగుల లక్ష్య ఛేదనలో 21 ఓవర్లలో 77 పరుగులు చేసిన ఇంగ్లాండ్​... 3 వికెట్లు కోల్పోయింది. రూట్​ 41 పరుగులతో ఇన్నింగ్స్​ను చక్కదిద్దుతున్నాడు. ఇంకా 29 ఓవర్లలో 156 పరుగులు కొట్టాల్సి ఉంది.

2019-06-21 20:26:24

20 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 76/3...

రూట్​ 40 పరుగులు, స్టోక్స్​ ఖాతా తెరవకుండా క్రీజులో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్​ మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతూ వికెట్లు సమర్పించుకుంటోంది ఇంగ్లీష్​ జట్టు. 

2019-06-21 20:18:52

కాటన్​ బౌల్డ్​ వికెట్​...

18.4 ఓవర్​ వద్ద ఇంగ్లాండ్​ మూడో వికెట్​ కోల్పోయింది.   35 బంతుల్లో 21 పరుగులు చేసిన మోర్గాన్​... ఉదానా బౌలింగ్​లో కాటన్​ బౌల్డ్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రూట్​, స్టోక్స్​ ఉన్నారు.

2019-06-21 20:00:06

14 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 50/2

ధనుంజయ డిసిల్వా వేసిన 13వ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. అనంతరం బౌలింగ్ చేసిన తీసారా పెరీరా 3 పరుగులు ఇచ్చాడు. 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది ఇంగ్లీష్ జట్టు. 

2019-06-21 19:53:25

12 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 42/2

పది ఓవర్ల అనంతరం బౌలర్​ను మార్చింది శ్రీలంక. 11వ ఓవర్ వేసిన ధనుంజయ డిసిల్వా 3 పరుగులే ఇచ్చాడు. అనంతరం ప్రదీప్ 12వ ఓవర్లో ఒక్క పరుగే వచ్చింది. ప్రస్తుతం మోర్గాన్(6), జోయ్ రూట్(17) క్రీజులో ఉన్నారు. 

2019-06-21 19:44:43

పది ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 38/2

పదో ఓవర్ వేసిన ప్రదీప్ మూడు పరుగులిచ్చాడు. 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది ఇంగ్లీష్ జట్టు. 

2019-06-21 19:41:41

9 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 35/2

ప్రదీప్ వేసిన 8వ ఓవర్లో పరుగులేమి రాలేదు. అనంతరం 9వ ఓవర్ వేసిన మలింగ రెండు ఫోర్లు సహా 9 పరుగులిచ్చాడు. ప్రస్తుతం మోర్గాన్(5), జోయ్ రూట్(16) క్రీజులో ఉన్నారు. 

2019-06-21 19:31:43

మలింగ బౌలింగ్​లో జేమ్స్​ విన్స్ ఔట్​

మలింగ వేసిన ఏడో ఓవర్ ఐదో  బంతికి జేమ్స్​ విన్స్ ఔటయ్యాడు. రెండు ఫోర్లు కొట్టి వేగంగా ఆడుతున్న విన్స్.. కుశాల్ మెండీస్​కు క్యాచ్​ ఇచ్చాడు. ఆరో ఓవర్ వేసిన ప్రదీప్ ఆరు పరుగులిచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 26/2

2019-06-21 19:22:26

ఐదు ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 15/1

నాలుగో ఓవర్ వేసిన ప్రదీప్ ఓ ఫోర్ సహీ 6 పరుగులు ఇచ్చాడు. అనంతరం మలింగ వేసిన ఐదో ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. జేమ్స్ విన్స్​(3), జోయ్ రూట్(12) క్రీజులో ఉన్నారు. 

2019-06-21 19:14:31

మూడు ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 4/1

రెండో ఓవర్ వేసిన ప్రదీప్ ఒక్క పరుగే ఇచ్చాడు. అనంతరం మలింగ వేసిన మూడో ఓవర్లో పరుగులేమి రాలేదు. ప్రస్తుతం క్రీజులో జేమ్స్ విన్స్​(2), జోయ్ రూట్(2) ఉన్నారు.  

2019-06-21 19:03:49

మలింగ్ బౌలింగ్​లో బెయిర్​ స్టో ఔట్

233 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ రెండో బంతికే బెయిర్​ స్టోను(0) ఎల్బీ డబ్ల్యూ చేశాడు మలింగ. ప్రస్తుతం ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి మూడు పరుగులు చేసింది.

2019-06-21 18:27:53

232 పరుగులు చేసిన శ్రీలంక

హెడ్డింగ్లే వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. మ్యాథ్యూస్(85) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. అవిష్కా(49), కుశాల్ మెండీస్(46) రాణించారు. ఇంగ్లీష్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్​వుడ్ చెరో మూడు వికెట్లు తీయగా.. అదిల్ రషీద్ 2 వికెట్లు తీశాడు.

2019-06-21 18:18:09

మార్క్​వుడ్ బౌలింగ్​లో మలింగ్ ఔట్​

48వ ఓవర్ 3వ బంతికి మలింగను ఔట్ చేశాడు మార్క్​వుడ్. చివర్లో శ్రీలంక ఇన్నింగ్స్ నిదానంగా సాగుతోంది. 48వ ఓవర్లో 6 పరుగులే వచ్చాయి. క్రీజులో మ్యాథ్యూస్(74) ఉన్నాడు. ప్రస్తుతం స్కోరు 220/9

2019-06-21 18:11:49

మార్క్​వుడ్ బౌలింగ్​లో ఇసురు వుడానా ఔట్​

47వ ఓవర్ 4వ బంతికి వుడానాను(6) ఔట్ చేశాడు మార్క్​వుడ్. మరో పక్క మ్యాథ్యూస్(68) క్రీజులో నిలబడి ఒంటరి పోరు చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 209/4

2019-06-21 18:05:18

ఆర్చర్ బౌలింగ్​లో పెరీరా ఔట్​

46వ ఓవర్ నాలుగో బంతికి తిసారా పెరీరా(2)ను ఔట్ చేశాడు జోఫ్రా ఆర్చర్. ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది లంక జట్టు. 

2019-06-21 17:55:43

ఆర్చర్ బౌలింగ్​లో ధనుంజయ ఔట్

44వ ఓవర్ మూడో బంతికే జోఫ్రా ఆర్చర్ ధనుంజయ డిసిల్వాను(29) ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో మ్యాథ్యూస్(56), తిసారా పెరీరా ఉన్నారు. శ్రీలంక 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.
 

2019-06-21 17:48:03

మ్యాథ్యూస్ అర్ధశతకం

మ్యాథ్యూస్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 84 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు మ్యాథ్యూస్. రెండో పవర్ ప్లే ప్రారంభమైన తర్వాత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు శ్రీలంక బ్యాట్స్​మెన్. 41వ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. అనంతరం 42వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ 3 పరుగులు ఇచ్చాడు. 42 ఓవర్లకు శ్రీలంక స్కోరు 183/5
 

2019-06-21 17:39:37

40 ఓవర్లకు శ్రీలంక స్కోరు 171/5

39వ ఓవర్ వేసిన రూట్ కేవలం 4 పరుగులే ఇచ్చాడు. అనంతరం అదిల్ రషీద్ వేసిన 40వ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో మ్యాథ్యూస్​(43), ధనుంజయ డిసిల్వా(24) ఉన్నారు. 
 

2019-06-21 17:32:03

38 ఓవర్లకు శ్రీలంక స్కోరు 162/5

36వ ఓవర్లో 4 పరుగులు రాగా.. 37వ ఓవర్ వేసిన మొయిన్ అలీ రెండు పరుగులే ఇచ్చాడు. అనంతరం 38వ ఓవర్లో అదిల్ రషీద్ 4 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో మ్యాథ్యూస్​(33), ధనుంజయ డిసిల్వా(4) ఉన్నారు. 

2019-06-21 17:21:47

35 ఓవర్లకు శ్రీలంక స్కోరు 154/5

34వ ఓవర్ వేసిన అదిల్ రషీద్ ఓ ఫోర్ సహా ఆరు పరుగులు ఇచ్చాడు. అనంతరం మొయిన్ అలీ పరుగుల వేగాన్ని కట్టడి చేశాడు. ఆ ఓవర్లో రెండు పరుగులే వచ్చాయి. 

2019-06-21 17:13:23

32 ఓవర్లకు శ్రీలంక స్కోరు 141/5

31వ ఓవర్ వేసిన మొయిన్ అలీ 3 పరుగులే ఇచ్చాడు. అనంతరం అదిల్ రషీద్ 32వ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో మ్యాథ్యూస్​(33), ధనుంజయ డిసిల్వా(4) ఉన్నారు. 

2019-06-21 17:06:22

ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన రషీద్​

30వ ఓవర్​ వేసిన అదిల్ రషీద్.. కుశాల్ మెండీస్​ను(46) ఔట్ చేశాడు. అనంతరం తర్వాతి బంతికే జీవన్ మెండీస్​ను డకౌట్​గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 135/5

2019-06-21 16:57:34

అర్ధశతకానికి చేరువలో కుశాల్

25వ ఓవర్ వేసిన మొయిన్ అలీ 8 పరుగులు ఇచ్చాడు. అనంతరం అదిల్ రషీద్ వేసిన 24వ ఓవర్లో ఒక్క పరుగే వచ్చింది. కుశాల్ మెండీస్(41) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం లంక 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. 

2019-06-21 16:51:54

22 ఓవర్లకు లంక స్కోరు 92/3

21వ ఓవర్ వేసిన మొయిన్ అలీ 3 పరుగులే ఇచ్చాడు. అనంతరం 22వ ఓవర్లో అదిల్ రషీద్ 5 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో మ్యాథ్యూస్(11),  కుశాల్ మెండీస్(28) ఉన్నారు.

2019-06-21 16:45:23

18 ఓవర్లకు లంక స్కోరు 75/3

మార్క్​వుడ్​ వేసిన 17వ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. అనంతరం 18వ ఓవర్ వేసిన స్టోక్స్​ కేవలం ఒక్కపరుగే ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో మ్యాథ్యూస్(2), కుశాల్ మెండీస్​(20) ఉన్నారు.

2019-06-21 16:41:12

15 ఓవర్లకు లంక స్కోరు 66/3

14వ ఓవర్ వేసిన స్టోక్స్  ఒక్క పరుగే ఇచ్చాడు. అనంతరం మార్క్​వుడ్ వేసిన 15వ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో మ్యాథ్యూస్(0), కుశాల్ మెండీస్(13) ఉన్నారు.

2019-06-21 16:33:39

49 పరుగులు చేసి ఔటైన ఫెర్నాండో

శ్రీలంక బ్యాట్స్​మన్ అవిష్కా ఫెర్నాండో 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మొదట నుంటి దూకుడుగా ఆడిన ఫెర్నాండో మార్క్​వుడ్ బౌలింగ్​లో అదిల్ రషీద్​కు క్యాచ్​ ఇచ్చాడు. ప్రస్తుతం 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది శ్రీలంక. ప్రస్తుతం క్రీజులో కుశాల్ మెండీస్​(10),  మ్యాథ్యూస్ ఉన్నారు. 
 

2019-06-21 16:26:36

12 ఓవర్లకు లంక స్కోరు 59/2

11వ ఓవర్​ వేసిన మార్క్​వుడ్​ ఓ ఫోర్​ సహా 11 పరుగులు ఇచ్చాడు. అనంతరం స్టోక్స్ వేసిన 12వ ఓవర్లో 3 పరుగులే వచ్చాయి. ప్రస్తుతం లంక.. 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. 

2019-06-21 16:10:20

పది ఓవర్లకు లంక స్కోరు 48/2

9వ ఓవర్ వేసిన వోక్స్ ఫోర్​తో సహా 6 పరుగులు ఇచ్చాడు. అనంతరం పదో ఓవర్లో ఆర్చర్​ ఓ ఫోర్, సిక్సర్​తో కలిపి 11 పరుగులు సమర్పించుకున్నాడు. పది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది లంక జట్టు. 

2019-06-21 16:01:27

రెండు మెయిడిన్లు చేసిన జోఫ్రా ఆర్చర్

ఇంగ్లీష్ బౌలర్ ఆర్చర్ రెండు మెయిడిన్లు చేశాడు. మొదట నాలుగో ఓవర్​ను మెయిడిన్ చేసిన ఆర్చర్.. అనంతరం 8వ ఓవర్​లోనూ పరుగులేమి ఇవ్వలేదు. ప్రస్తుతం క్రీజులో అవిష్కా ఫెర్నాండో(31), కుశాల్ మెండీస్(3) ఉన్నారు. 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టోపోయి 37 పరుగులు చేసింది శ్రీలంక

2019-06-21 15:55:24

నాలుగు ఓవర్లకు 4 పరుగులు చేసిన శ్రీలంక

లంక బ్యాట్స్​మెన్ నిదానంగా ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో అవిష్కా ఫెర్నాండో(1), కుశాల్ మెండీస్(0) ఉన్నారు. మూడో ఓవర్లో ఒక్క పరుగు రాగా.. నాలుగో ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ పరుగులేమి ఇవ్వలేదు.  

2019-06-21 15:42:19

వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

రెండో ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ చివరి బంతికి కరుణరత్నేను ఔట్ చేశాడు. బట్లర్​కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం మూడో ఓవర్ మొదటి బంతికే మొయిన్ అలీని ఔట్ చేశాడు క్రిస్ వోక్స్. 2.1 ఓవర్లలో 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది శ్రీలంక

2019-06-21 15:40:18

తొలి ఓవర్లో రెండు పరుగులు చేసిన శ్రీలంక

ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. తొలి ఓవర్ వేసిన అతడు రెండే పరుగులే ఇచ్చాడు. క్రీజులో కరుణరత్నే(1), కుశాల్ పెరీరా(1) ఉన్నారు. 

2019-06-21 15:32:59

టాస్ గెలిచిన శ్రీలంక

ఇంగ్లాండ్​తో జరుగుతున్న ప్రపంచకప్​ 27వ మ్యాచ్​లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హెడ్డింగ్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్​లో  జట్టులో రెండు మార్పులతో బరిలో దిగుతుంది శ్రీలంక. మరోవైపు ఇంగ్లాండ్ ఎలాంటి మార్పుల్లేకుండా ఆడుతుంది.

2019-06-21 15:20:15

.

2019-06-21 15:11:09

.

2019-06-21 15:03:02

.

2019-06-21 14:36:24

.

2019-06-21 14:26:30

.

Last Updated : Jun 21, 2019, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details