మహేంద్ర సింగ్ ధోనీ గ్లౌజ్ అంశానికి భారత క్రీడా సమాజం నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ విషయంపై స్పందించారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు. వీలైనంత త్వరగా బీసీసీఐ ఈ సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
"ఈ అంశం దేశ ప్రజల విశ్వాసానికి సంబంధించింది. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని బీసీసీఐ ధోనీకి అనుకూలంగా పరిష్కరించాలి" -కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి.
"మేమంతా మా దేశాన్ని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. వీరుల త్యాగాలను గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అదే ధోనీ చేశాడు. ఈ అంశాన్ని జాతీయవాదంగా కాకుండా దేశభక్తిగా చూడాలి" - సురేశ్ రైనా, క్రికెటర్
"ధోనీ గ్లౌజ్‌పై ఉన్న బలిదాన్ గుర్తును ఐసీసీ తొలగించమని చెప్పి భారత సైనికుల త్యాగాలను అగౌరవపరిచింది. ఈ అంశంలో మా పూర్తి మద్దతు మహీకి ఉంటుంది" -యోగేశ్వర్ దత్, రెజ్లర్
"ఆటగాడు నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఒకవేళ వాటికి విరుద్ధంగా ఉంటే ధోనీ బలిదాన్ గుర్తును తొలిగిస్తే మంచిది" - బైచుంగ్ భూటియా, భారత మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ పారా మిలిటిరీకి సంబంధించిన బలిదాన్ గుర్తున్న గ్లౌజ్‌ను ధరించి కీపింగ్ చేశాడు. దీనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఆ సింబల్‌ను తొలగించాలని ఐసీసీ బీసీసీఐను కోరింది.
ఇవీ చూడండి.. 'ధోనీ ఆ బ్యాడ్జి ధరించడంలో తప్పేమీ లేదు'