ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాయి. ఈ రెండు జట్ల మధ్య నేడు సాయంత్రం 6 గంటలకు కార్డిఫ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు విజయం కోసం ఊవిళ్లూరుతున్నాయి. మెగాటోర్నీల్లో దురదృష్టవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికాకు ఈ ప్రపంచకప్ ఏ మాత్రం కలిసిరాలేదు. టోర్నీ మొదటి నుంచి ఓటములు జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. వరుసగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, భారత్ చేతిలో ఓడిన సఫారీ జట్టుకు విండీస్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఫలితంగా సెమీస్ ఆశల్ని దాదాపు కోల్పోయింది. బ్యాటింగ్‌లో నిలకడలేమి డుప్లెసిస్ సేనను ఇబ్బంది పెడుతోంది. సారథి డుప్లెసిస్, డికాక్, మిల్లర్, డుమిని మరింతగా రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో రబాడపై ఎక్కువగా ఆధారపడుతోంది.