ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో సఫారీ జట్టు అఫ్గాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 34.1 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు హజ్రతుల్లా (22), నూర్ అలీ (32) ఫర్వాలేదనిపించారు. చివర్లో రషీద్ ఖాన్ 35 పరుగులతో ఆకట్టుకోగా 125 పరుగులు చేయగలిగింది అఫ్గాన్ జట్టు.