ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్.. న్యూజిలాండ్‌పై ఉత్కంఠపోరులో విజయం సాధించింది. ఐసీసీ నిబంధనల వల్లే కివీస్ ఓడిపోయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లూ ఐసీసీ రూల్స్ మార్చాల్సిన అవసరముందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా.. ఐసీసీ ఈ నిబంధనలను ఓసారి పునఃపరిశీలించాలని కోరాడు.
'ఐసీసీ నిబంధనలపై దృష్టి సారించాలి'
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ ఓడిపోయింది. ఐసీసీ నిబంధనల వల్లే న్యూజిలాండ్ ఓటమి పాలయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంపై స్పందించాడు.
రోహిత్
లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫలితంపై రోహిత్ శర్మ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఐసీసీ నిబంధనలపై నిశితంగా దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపాడు. క్రికెట్‌కు సంబంధించిన కొన్ని నిబంధనల్లో మార్పులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
ఇవీ చూడండి.. 'ఆ ఆరు పరుగులు అంపైర్ల తప్పిదమే'