ఏబీ డివిలియర్స్‌ను ప్రపంచకప్ జట్టులోకి చేర్చుకోకపోవడం సరైన నిర్ణయమే అని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. ఒక్కరి కోసం చూసుకుంటే జట్టు మొత్తం మీద ప్రభావం పడుతుందన్నాడు.
"నేను డివిలియర్స్‌కు పెద్ద అభిమానిని. కానీ చివరి నిమిషంలో అతడు మళ్లీ జట్టులోకి రావడం సరైనది కాదు. ఆ నిర్ణయం మిగిలిన ఆటగాళ్ల మీద ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో దక్షిణాఫ్రికా బోర్డు సరైన నిర్ణయమే తీసుకుంది -జాంటీ రోడ్స్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు.
గత ఏడాది మే లో అంతర్జతీయ క్రికెట్ నుంచి డివిలియర్స్ వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికా ప్రపంచకప్ తుదిజట్టు ఎంపిక ముందు మళ్లీ వస్తానని తన అభిప్రాయాన్ని ప్రొటీస్ బోర్డు ముందు ఉంచాడు డివిలియర్స్. అందుకు వారు అంగీకరించలేదు.
ఈ ప్రపంచకప్‌లో సెమీస్ రేసు నుంచి దక్షిణాఫ్రికా అందరికంటే ముందుగానే వైదొలిగింది. సమష్టిగా రాణించడంలో విఫలమైన ప్రొటీస్ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో 2 విజయాలు మాత్రమే సాధించింది.
ఇది చదవండి: వెస్టిండీస్ పోరుతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న శ్రీలంక