తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ X పాక్ మ్యాచ్​ జరిగే అవకాశముందా? - వర్షం

భారత్​-పాకిస్థాన్ మ్యాచ్​కు వర్షం అడ్డంకిగా మారే అవకాశముందని అక్యూవెదర్​ వెబ్​సైట్​ తెలిపింది. ఓల్డ్​ ట్రాఫోర్డ్​లో ఆదివారం మధ్యాహ్నం తేలికపాటి జల్లులతో కూడిన వర్షం మ్యాచ్​కు అంతరాయం కలిగించొచ్చని ప్రకటించింది.

భారత్​ X పాక్ మ్యాచ్​ జరిగే అవకాశముందా?

By

Published : Jun 16, 2019, 12:24 PM IST

ప్రతి క్రికెట్​ అభిమాని భారత్-పాకిస్థాన్ మ్యాచ్​ చూసేందుకు సిద్ధమవుతున్నాడు. చిరకాల ప్రత్యర్థుల్లో గెలుపెవరిదో తెలుసుకునేందుకు మరికాసేపట్లో టీవీలకు అతుక్కుపోనున్నాడు. అయితే మాంచెస్టర్​లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఏకంగా మ్యాచ్​ నిర్వహణపైనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇంగ్లాండ్​ను వర్షాలు ముంచెత్తుతుండటం, రసవత్తర పోరుకు వేదికైన ఓల్డ్​ ట్రాఫోర్డ్​లో భారీ వర్షాలు కురుస్తుండటం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు భారత్​-పాక్ మ్యాచ్​ జరుగుతుందో? లేదో? అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​ అభిమానుల మెదళ్లను తొలిచివేస్తోంది. ఆదివారం మాంచెస్టర్​లో వర్షం పడే అవకాశముందని అక్యూవెదర్​ వెబ్​సైట్ తెలపడం అందరినీ మరింత ఆందోళనలో పడేసింది.

" మ్యాచ్​కు రెండు రోజుల ముందే ఓల్డ్ ట్రాఫోర్డ్​ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం మధ్యాహ్నం కూడా తేలికపాటి చిరుజల్లులు కురిసి దాయాదుల పోరుకు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. ఉష్టోగ్రత 17 డిగ్రీలకు చేరనుంది."
-అక్యూవెదర్​, వాతావరణ సంస్థ

భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్‌కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షం అడ్డంకిగా మారకూడదని అందరూ కోరుకుంటున్నారు.

ఈ ప్రపంచకప్​లో ఇప్పటికే వర్షం కారణంగా నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇందులో భారత్‌-కివీస్​ మ్యాచ్‌ కూడా ఉంది. బ్లాక్​ క్యాప్స్​తో మ్యాచ్‌ వర్షార్పణం అయినందుకే అభిమానులు ఐసీసీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల పోస్టులు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details